Surya Gochar 2022: కన్యారాశిలో సూర్య సంచారం... ఈ రాశులవారికి అఖండ ఐశ్వర్యం!

Surya Gochar 2022: గ్రహాల రాజు సూర్యదేవుడు సెప్టెంబర్ 17, 2022న తన సొంత రాశి అయిన సింహరాశి నుండి కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. కాబట్టి సూర్యుడి రాశి మారడం వల్ల ఏ రాశి వారికి శుభ ఫలితాలు కలుగబోతున్నాయో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 10, 2022, 12:01 PM IST
Surya Gochar 2022: కన్యారాశిలో సూర్య సంచారం... ఈ రాశులవారికి అఖండ ఐశ్వర్యం!

Surya Gochar 2022: గ్రహాల రాజు సూర్యుడు ప్రతి నెల తన రాశిని మారుస్తాడు. సూర్యుడి ఈ రాశి మార్పునే మనం సంక్రాంతి అంటాం. ఈ నెల 17న సూర్యభగవానుడు కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనినే కన్యా సంక్రాంతి అంటారు. కన్యారాశిలో సూర్య సంచారం సెప్టెంబరు 17 ఉదయం 07:11 గంటలకు (Sun Transit in Virgo 2022) జరుగుతుంది. సూర్యుడి సంచారం వల్ల ఏ రాశివారికి లాభం చేకూరుతుందో తెలుసుకుందాం. 

ఈ రాశులవారికి శుభప్రదం
మేషం (Aries): సూర్య గ్రహ సంచారం వల్ల ఈ రాశివారు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. పెండింగ్లో ఉన్న అన్ని పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. 
కర్కాటకం (Cancer): కర్కాటక రాశి ప్రజలు సూర్యుని సంచారం నుండి అపారమైన ప్రయోజనాలను పొందనున్నారు. అదృష్టంతో వీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు.  దీర్ఘకాలంగా ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే వారి ఆరోగ్యం కుదుటపడుతుంది.
వృశ్చికం (Scorpio): వృశ్చిక రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. మీరు వివిధ ఆదాయ వనరుల ద్వారా డబ్బు పొందుతారు. కుటుంబంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. 
ధనుస్సు (Sagittarius): సూర్య రాశి మార్పు ఫలితంగా ధనుస్సు రాశి వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపార వృద్ధి చెందుతుంది. మానసిక ఒత్తిడి నుండి బయటపడతారు. కెరీర్ లో పురోగతి ఉంటుంది. 

Also Read: పంచక సమయంలో పితృ పక్షం ప్రారంభం, రాబోయే 15 రోజులు ఈ పనులు చేయడం మానేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News