Sun Transit 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. సూర్యుడు ప్రతినెల తన రాశిని మారుస్తాడు. సూర్యుడి రాశి మారడాన్నే సంక్రాంతి అంటారు. ఇవాళ సూర్యభగవానుడు ఉదయం 07:37 గంటలకు కర్కాటక రాశిని విడిచిపెట్టి సింహరాశిలోకి (Sun Transit in leo 2022) ప్రవేశించనున్నాడు. దీని ప్రభావం మెుత్తం 12 రాశులపై కనిపిస్తుంది. సొంత రాశిలో సూర్యుడి సంచారం సెప్టెంబరు 17వరకు ఉంటుంది. అనంతరం అతడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. సింహరాశిలో సూర్య సంచారం కారణంగా కొన్ని రాశులవారు అపారమైన ప్రయోజనాలను పొందనున్నారు. వీరి అదృష్టం సూర్యుడిలా ప్రకాశిస్తుంది. ఈరాశులవారు లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు పొందుతారు.
సూర్య సంచారం ఈ రాశులకు వరం
వృషభం (Taurus)- సింహరాశిలో సూర్యుని సంచారం ఈ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉండనుంది. ఈ సమయంలో ఈ రాశివారు కొత్త వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. సమాజంలో కీర్తి, ప్రతిష్ట, గౌరవం పెరుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో వీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు.
సింహం (Leo) - సూర్యుడు సంచారం ఈ రాశివారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కెరీర్ లో పురోగతి ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
కన్య (Virgo)- సూర్యుడి రాశిమార్పు ఈ రాశివారికి చాలా మేలు చేస్తుంది. విదేశీ ప్రయాణ యోగం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో భారీగా లాభాలు గడిస్తారు.
ధనుస్సు (Sagittarius)- ధనుస్సు రాశి వారికి సూర్య సంచారం శుభప్రదం. కెరీర్ లో పురోగతి ఉంటుంది. ఈ వ్యక్తులు ఈ కాలంలో సానుకూల ఫలితాలను ఇస్తాయి. సూర్యభగవానుని అనుగ్రహంతో వీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు.
కుంభం (Aquarius): కుంభ రాశి వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది. సూర్యుడు రాశి మారడం వల్ల ఈరాశివారు భారీగా లాభాలను పొందనున్నారు. శత్రువులపై విజయం సాధిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. కూడా ప్రయోజనం ఉంటుంది. ఈ సమయంలో శత్రువులు జయిస్తారు. కీర్తి మరియు కీర్తి పెరుగుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook