Surya Rashi Parivartan: సూర్యుడి రాశి మార్పు... సెప్టెంబర్ 17 వరకు ఈ రాశులవారు జాగ్రత్త!

Surya Rashi Parivartan: సూర్యుడి రాశి మార్పు ధనుస్సు రాశి వారికి ఆకస్మిక ధన నష్టం కలిగించే అవకాశం ఉంది. డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు నిపుణుల సలహా తీసుకోండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 26, 2022, 10:26 AM IST
Surya Rashi Parivartan: సూర్యుడి రాశి మార్పు... సెప్టెంబర్ 17 వరకు ఈ రాశులవారు జాగ్రత్త!

Surya Rashi Parivartan 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, సూర్యుడిని అన్ని గ్రహాలకు అధిపతిగా భావిస్తారు. సూర్యుడు ఆగస్టు 17 ఉదయం 7.37 గంటలకు కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి (Sun Transit In leo 2022) ప్రవేశించాడు. అక్కడే సెప్టెంబర్ 17 వరకు ఉండనున్నాడు. ఆ తర్వాత కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. సింహరాశిలో సూర్యుని సంచారం వల్ల కొన్ని రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రాశులేంటో తెలుసుకుందాం.

ఈ రాశులవారు జాగ్రత్త
సింహ రాశి (Leo): సూర్యుడు సింహరాశి యెుక్క పన్నెండవ ఇంటిలో సంచరిస్తాడు. జ్యోతిషం ప్రకారం ఈ రాశి మార్పు సింహ రాశి వారికి లాభదాయకం కాదు. అందువల్ల ఈ సమయంలో వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి లేకుంటే ఇబ్బంది కలగవచ్చు.  

ధనుస్సు రాశి (Sagittarius): ధనుస్సు రాశి వారు ఈసారి ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. పెట్టుబడి పెట్టేటప్పుడు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఈ  సమయంలో ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. పని చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండటం అవసరం. 

మకరం (Capricorn): సూర్యుని యొక్క ఈ సంచారం మకర రాశి వారికి కూడా మంచి ఫలితాలను ఇవ్వదు. వ్యాపారంలో భారీగా నష్టం వస్తుంది. తెలిసిన వ్యక్తే మోసం చేయవచ్చు. కుటుంబంలో కలహాలు రావచ్చు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. 

మీనరాశి (Pisces): సూర్యుడు మీన రాశి యెుక్క ఐదో ఇంట్లో సంచరిస్తాడు. ఈ సమయంలో వారు ఆఫీసులో  ఉన్నతాధికారుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుంది. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. వ్యాపారంలో నష్టం రావచ్చు.  తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.

Also Read:Shanishchari Amavasya: ఈ రాశులవారు శనిశ్చరి అమావాస్య నాడు ఇలా చేస్తే.. శనిపీడ నుండి విముక్తి! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News