గ్రహాలు, నక్షత్రాలు మారడం వ్యక్తి జీవితంలో ఆనందం, సమస్యలు రెండూ ఉంటాయి. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో గ్రహ పరివర్తనం చెందుతుంది. సూర్యుడు ప్రతి 30రోజులకు మరో రాశిలోకి మారుతుంటుంది.
ఫిబ్రవరి 13న సూర్యుడు మకర రాశి నుంచి బయటకొచ్చి..కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు. సూర్యుడు కుంభరాశిలో ప్రవేశం వల్ల చాలా రాశుల జాతకుల జీవితంలో అనుకూల ప్రభావం ఉంటుంది. ఈ సందర్భంగా గౌరవ మర్యాదలు, ఆరోగ్యం, ఆర్ధిక లాభాలుంటాయి. జ్యోతిష్యం ప్రకారం సూర్య గోచారం ఫిబ్రవరి 13 ఉదయం 9 గంటల 57 నిమిషాలకు ఉంటుంది. ఈ సందర్భంగా సూర్యుడు మకర రాశి నుంచి కుంభరాశిలో గోచారం చేయనున్నాడు. ఈ పరిస్థితుల్లో సూర్యుడు, శని గ్రహాల యుతి ఏర్పడనుంది. రెండు బలమైన గ్రహాల యుతి రాశుల జాతకాలకు అంతులేని అదృష్టం కల్గించనుంది.
ధనస్సు రాశి
సూర్యుడు కుంభరాశిలో గోచారం కారణంగా ధనస్సు రాశి జాతకులకు విశేష లాభం కలగనుంది. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగం లభించేందుకు పూర్తి అవకాశాలున్నాయి. ఈ సమయంలో కష్టపడి సిద్ధంగా ఉండాలి. త్వరలోనే గుడ్‌న్యూస్ వింటారు. ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే..ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. తండ్రి సహకారం తీసుకోవాలి. దీంతో ధనలాభం కలుగుతుంది. అటు సూర్యుడి ప్రభావం పెంచేందుకు సూర్యుడికి నిర్ణీత పద్థతిలో జలాభిషేకం చేయాలి.
కన్యారాశి
గ్రహాల రాజు సూర్యుడు ఫిబ్రవరి 13న కుంభరాశిలో గోచారం చేయనున్నాడు. కన్యారాశి జాతకులకు శుభదాయకంగా ఉంటుంది. ఈ సందర్భంగా గౌరవ మర్యాదలు లభిస్తాయి. కాస్త అప్రమత్తత కూడా అవసరం. ప్రత్యర్ధులు మీకు వ్యతిరేకంగా కుట్ర ఉంటుంది. ఉద్యోగార్ధులకు కొత్త బాధ్యతలు లభించవచ్చు.
వృషభరాశి
వృషభరాశి జాతకులకు అదృష్టం తోడవుతుంది. ఈ సందర్భంగా ఉద్యోగం మారాలనుకుంటే..కొత్త అవకాశాలు లభిస్తాయి. ఏదైనా మంచి కంపెనీ నుంచి ఉద్యోగాలు లభిస్తాయి. మార్చ్ 15 వరకూ వ్యాపారానికి సంబంధించిన లాభాలు అమితంగా ఉంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు ప్రాప్తిస్తాయి.
Also read: Solar Eclipse 2023: సూర్య గ్రహణం ఎప్పుడు, ఏ సమయంలో, ఇండియాలో ఉంటుందా లేదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook