Sun Transit Effect on Virgo: గ్రహాలన్నింటికీ రాజుగా పరిగణించే సూర్య గ్రహం (సూర్య నారాయణుడు) ప్రతీ నెలా ఏదో ఒక రాశిలో సంచరిస్తుంది. ఈ క్రమంలో ఏడాదికొకసారి తాను అధిపతిగా ఉన్న సింహరాశిలోకి ప్రవేశిస్తుంది. అక్కడ నెల రోజుల పాటు సూర్య సంచారం ఉంటుంది. ఈసారి ఆగస్టు 17న సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇది ఉత్తర ఫాల్గుణిలో వస్తున్నందునా కన్య రాశి వారికి ఇది ముఖ్యమైనదిగా చెబుతున్నారు. సింహ రాశిలో సూర్య సంచారం కన్య రాశి వారిపై చూపే ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం...
ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి :
సూర్య సంచార కాలంలో ఉద్యోగస్తులు అత్యంత అప్రమత్తతో, జాగ్రత్తతో వ్యవహరించాలి. స్వల్ప నిర్లక్ష్యం లేదా అజాగ్రత్త వారికి చెడు తలపెడుతుంది. ఈ కాలంలో ఆర్థిక భారం కూడా పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. తద్వారా పలు ఇబ్బందులు తలెత్తుతాయి.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం :
సూర్య సంచార కాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. జ్వరం వచ్చే అవకాశం ఉన్నందునా జాగ్రత్తగా ఉండాలి. పొత్తి కడుపు నొప్పి, మలబద్దకం వంటి సమస్యలు రావొచ్చు. కళ్ల మంట, కళ్లలో ఎరుపు వంటి సమస్యలు రావొచ్చు. వైద్యుల సలహాపై మాత్రమే మందులు వాడాలి.
ప్రభుత్వ నోటీసు పొందవచ్చు
ప్రతీ పనిలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపార ఒప్పందాలకు సంబంధించిన పత్రాలను జాగ్రత్తగా పరిశీలించాకే సంతకాలు చేయాలి. ప్రభుత్వ పనులకు సంబంధించిన రసీదులు మీవద్ద ఉంచుకోండి. ఏదైనా నోటీసులు అందినట్లయితే అవి మీకు ఉపయోగపడుతాయి.
స్నేహితులతో సరదాగా ఉండండి
స్నేహితులతో సరదాగా గడపండి. వారితో కలిసి ఉన్నప్పుడు మీపై ఏదైనా జోక్ వేస్తే సరదాగా తీసుకోండి. చీటికిమాటికి సీరియస్ అవొద్దు. ఏవైనా ఇబ్బందులు తలెత్తితే స్నేహితుల సహాయం కోరండి. లేదా వారి సలహాలు, సూచనలు స్వీకరించండి.
Also Read: Chiranjeevi: చిరంజీవి ప్రమోట్ చేస్తే సినిమా ఫట్టేనా.. అసలేమవుతోంది?
Also Read: బంగారం ప్రియులకు శుభవార్త.. స్థిరంగా పసిడి ధర! హైదరాబాద్‌లో నేటి రేట్లు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook