Sun Transit 2022: సూర్య గ్రహ సంచారం వల్ల ఆ రాశువారికి ఈ నెల, వచ్చే నెల డబ్బే డబ్బు..

Sun Transit 2022 Impact: సూర్య గ్రహ సంచారం ప్రతి నెల జరుగుతుంది. అంతేకాకుండా ఈ క్రమంలో చాలా రకాల ప్రయోజనాలు పొందుతారని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా నాలుగు రాశువారు చాలా ప్రయోజనాలు పొందుతారని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 17, 2022, 10:09 AM IST
Sun Transit 2022: సూర్య గ్రహ సంచారం వల్ల ఆ రాశువారికి ఈ నెల, వచ్చే నెల డబ్బే డబ్బు..

Sun Transit 2022 Impact: సూర్యుడిని అన్ని గ్రహాలకు రారాజుగా జోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. అంతేకాకుండా సూర్యుడిని విజయం, గౌరవం, తండ్రి, సోదరుడు, ఆత్మ, ధైర్యంగా పరిగణిస్తారు. అయితే అన్ని గ్రహాల వలే ఈ సూర్య గ్రహం సంచారం చేయనుంది. దీంతో పలు రాశి చక్రాల్లో మార్పులు వచ్చే అవకాశాలున్నాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సూర్య సంచారం వృశ్చిక రాశిలోకి ప్రవేశించింది. దీని తీవ్ర ప్రభావం 4 రాశుల వారిపై పడే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ క్రమంలో పలు జాగ్రత్తలు పాటించాలని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంచారం వల్ల అన్ని రాశువారికి మంచి ఫలితాలే కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. ఇదే సూర్య గ్రహం డిసెంబర్‌ 16న కూడా సంచారం చేయబోతోంది. అయితే దీని కారణంగా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సూర్య సంచారం వల్ల ఈ రాశువారు చాలా ప్రయోజనాలు పొందుతారు:

సింహ రాశి:
సింహ రాశి వారికి అధిపతిగా సూర్యుడు వ్యవహరిస్తాడు. అయితే ఈ సంచారం కారణంగా ఈ రాశువారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ
సంచారం వల్ల భవిష్యత్‌ జీవితంలో చాలా రకాల ఫలితాలు పొందుతారు. వ్యాపారంల్లో ఈ రాశులవారు లాభాలు కూడా పొందుతారు. కాబట్టి ఆర్థిక పరమైన సమస్యలు కూడా దూరమవుతాయి. సింహ రాశి వారికి ఇది పెట్టు బడులు పెట్టడానికి సరైన సమయంగా భావించవచ్చు.య ఈ క్రమంలో లగ్జరీ జీవితాన్ని గడిపే ఛాన్స్‌ కూడా ఉంది.

వృశ్చికరాశి:
సూర్యుని సంచారం వృశ్చికరాశిలో జరగడం వల్ల దీని ప్రభావం ఈ రాశి వారిపై కూడా పడే అవకాశాలున్నాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంచారం కారణంగా వీరు ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా సమాజంలో ఈ రాశివారిపై గౌరవం పెరిగే ఛాన్స్‌ ఉందని శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ సంచారంతో ఉపశమనం లభిస్తుంది.

కుంభ:
సూర్యుడు ఇతర రాశిలోకి సంచారం చేయడం వల్ల కుంభ రాశి వారికి కూడా శుభప్రద గడియలు మొదలవుతాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో ఈ రాశివారు చాలా రకాల ప్రయోజనాలు పొందే ఛాన్స్ కూడా ఉంది. ఈ రాశి వారు డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు కూడా వెతుకుతారు. ఈ క్రమంలో వీరి బ్యాంక్‌ బ్యాలెన్స్‌ కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ క్రమంలో ఆర్థిక అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

మీన:
సూర్యుడు ఇతర గ్రహంలోకి సంచారం చేయడం వల్ల మీన రాశి వారు చాలా రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.  ఈ సంచారం మీన రాశి వారికి శుభవార్తలు తెచ్చి పెడుతుంది. అంతేకాకుండా అన్ని పనులు అనుకులంగా మారుతాయి.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

 

Also Read : నా చిన్ననాటి మరో పేరు చెరిగిపోయింది.. కృష్ణ మృతిపై స్టార్ కామెంటేటర్ సంతాపం!

Also Read : Krishna Demise: తెలుగు సినిమాకు సాంకేతికత, కొత్త ఆవిష్కరణలు చేసిన చేసిన కృష్ణ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News