Sun-Mars Conjunction 2023: ఒక నిర్దిష్ట వ్యవధిలో సింహరాశిలో సూర్య, కుజుడు సంయోగంలో ఉన్నప్పుడు ప్రత్యేక యోగం ఏర్పడుతుంది. అంతే కాకుండా దీనికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. సింహరాశిలో ఈ రెండు రాశుల కలయిక ఆగస్టు 17వ తేదీన జరగబోతోంది దీనికి కారణం గా అన్ని రాశుల వారిపై ఈ గ్రహ సంచారాల ప్రభావం పడి మంచి ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర చెబుతున్నారు. అంతేకాకుండా ఈ రెండు గ్రహాల కలయిక కొన్ని రాశుల వారిపై తీవ్ర దుష్ప్రభావాలను కలిగించే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ఈ గ్రహాల కలయిక క్రమంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
రెండు గ్రహాల సంయోగం వల్ల ఈ రాశుల వారిపై తీవ్ర ప్రభావం:
మేషరాశి:
సింహరాశిలో సూర్యుడు, కుజుడు కలయిక మేషరాశి వారికి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ఈ సంయోగం మేష రాశి వారికి ఐదవ స్థానంలో జరగబోతోంది. దీని కారణంగా మీ పిల్లల నుంచి మంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్స్ లభించడమే కాకుండా జీతాల్లో ఇంక్రిమెంట్స్ కూడా లభిస్తాయి. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఈ రాశి వారికి సంయోగం వల్ల ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా
సింహ రాశి:
సింహరాశిలో సూర్యుడు కుజుడి కలయిక కారణంగా ఈ రాశి వారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు ఊహించని లాభాలు పొందే ఛాన్స్ కూడా ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఇక వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టే వారికి రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. మీరు చేస్తున్న పనుల్లో ఈ క్రమంలో మీ కుటుంబ సభ్యుల మద్దతు లభించి ప్రయోజనాలు పొందవచ్చు. అంతేకాకుండా సింహ రాశి వారికి ఈ సంయోగం కారణంగా జీవితం సుఖమయం అవుతుంది.
కర్కాటక రాశి:
ఈ గ్రహాల సంయోగం కారణంగా కర్కాటక రాశి వారి కూడా అపారమైన లాభాలు కలుగుతాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ రాశి వారికి కుజుడు సూర్య గ్రహాల సంయోగం మూడవ స్థానంలో ఏర్పడబోతోంది. దీని కారణంగా ఆర్థికంగా ఎలాంటి లోటుండదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో కష్టపడి పనులు చేయడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు లభించే ఛాన్స్ కూడా ఉంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు.
Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook