Sri Rama Navami 2023: హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో శ్రీరామ నవమి ఒకటి. ఈరోజున దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు శ్రీరాముడి జన్మదినాన్ని జరుపుకుంటారు. మన తెలుగు లోగిళ్లలో అయితే ఈ దినాన సీతారాముల కళ్యాణం జరుపుతారు. శాస్త్రాల ప్రకారం, శ్రీమహావిష్ణువు యెుక్క ఏడో అవతారంగా శ్రీరాముడిని భావిస్తారు.
తేదీ, శుభ ముహూర్తం
హిందూ క్యాలెండర్ ప్రకారం, రామ నవమి చైత్ర మాసం తొమ్మిదవ రోజున వస్తుంది. ఈ సంవత్సరం ఈ ఫెస్టివల్ మార్చి 30, గురువారం నాడు జరుపుకోనున్నారు. దృక్ పంచాంగ్ ప్రకారం, శ్రీరామ నవమి శుభముహూర్తం ఉదయం 11:11 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 01:40 గంటలకు ముగుస్తుంది.
పూజా విధానం (Puja vidhanam)
పండుగ నాడు తెల్లవారుజామున నిద్ర లేచి స్నానంచేయాలి. తర్వాత ఇంటి పూజా మందిరాన్ని శుభ్రం చేసి ఏదైనా పీఠంపై శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించండి. దేశీ నెయ్యితో దీపాన్ని వెలగించండి. విగ్రహానికి కుంకుమ పెట్టి..పూల మాల వేసి దేవుడి ముందు స్వీట్లును ఉంచండి. అనంతరం సాత్విక ఆహారాన్ని తయారు చేసి.. దేవుడికి భోగాన్ని సమర్పించండి. తర్వాత చిన్న పిల్లలను పిలిచి ప్రసాదంతోపాటు బహముతలను ఇవ్వండి. ఈరోజున కొంతమంది భక్తులు యజ్ఞం చేయడంతోపాటు శ్రీరాముడికి 56 భోగ్‌లు సమర్పిస్తారు. ఇవాళ భక్తులు రామమందిరాన్ని సందర్శించి ప్రార్థనలు చేస్తారు. ఈ పవిత్ర దినాన శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్య రామమందిరాన్ని చాలా మంది ప్రజలు దర్శిస్తారు.
Also Read: Surya Gochar 2023: ఉన్నతమైన రాశిలోకి సూర్యభగవానుడు.. మే 15 వరకు ఈ 4 రాశులవారు జాగ్రత్త..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి