Sawan Pradosh Vrat 2022 Importance: హిందువులు సోమవారం శివుడిని పూజిస్తారు. శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలకు చాలా విశిష్టత ఉంది. జూలై 25న రెండో శ్రావణ సోమవారం. అంతేకాకుండా ఇదే రోజు మెుదటి ప్రదోష వ్రతం (Sawan Pradosh Vrat 2022) కూడా. అదేవిధంగా సోమవారం నాడే రెండు రాజయోగాలు కూడా ఏర్పడుతున్నాయి. ఇన్ని పవిత్రమైన యాదృచ్ఛికాలు ఒకరోజు ఏర్పడటం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఏడాది పొడవునా ప్రదోష వ్రతాన్ని చేయాలనుకునేవారు ఈ రోజు నుండే ప్రారంభించండి. ఎందుకంటే ఇది చాలా పవిత్రమైన రోజు. శ్రావణ సోమ ప్రదోష రోజు యెుక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి.
శ్రావణ సోమ ప్రదోష వ్రతం 2022
ప్రారంభం: జూలై 25, సోమవారం, సాయంత్రం 04:15
ముగింపు: జూలై 26, మంగళవారం, సాయంత్రం 06:46 గంటలకు
శివపూజ ప్రదోష ముహూర్తం: సాయంత్రం 07.17 నుండి రాత్రి 09.21 వరకు
ప్రదోష వ్రతం ప్రత్యేకత
క్యాలెండర్ ప్రకారం, ఏడాదిలో మొత్తం 24 ప్రదోష రోజులు ఉంటాయి. ప్రతి నెల త్రయోదశి తిథి నాడు ప్రదోష వ్రతం పాటించే సంప్రదాయం ఉంది, ఎందుకంటే ఈ తిథికి శివుడి ఎంతో ఇష్టమైనది. శ్రావణ మాసం శివుడికి ఎంతో ప్రీతికరమైనది. ఈ మాసంలో ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తే.. మీరు కోరికలు ఫలిస్తాయి.
అదే రోజు 2 రాజయోగాలు
జూలై 25, సోమవారం నాడు శ్రావణ మెుదటి ప్రదోష వ్రతాన్ని పాటిస్తారు. ఈ రోజున షష్ మరియు హన్స్ రాజయోగంతో పాటు.. బుధాదిత్య, సర్వార్థ సిద్ధి యోగ మరియు అమృత సిద్ధి యోగాల యొక్క శుభ కలయిక ఏర్పడుతోంది. ఈ శ్రావణ సోమ ప్రదోష రోజున శివతాండవ స్తోత్రాన్ని పఠిస్తే శివుడు అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా లక్ష్మీదేవి ప్రసన్నురాలై.. మిమ్మిల్ని కష్టాల నుండి విముక్తి చేస్తుంది.
Also Read: Laxmidevi Mantralu: ఈ పవర్ పుల్ మంత్రాలు పఠించండి... ధనవంతులు అవ్వండి!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook