Mahamrityunjay Mantra: మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడంలో ఈ తప్పులు చేయకండి!

Mahamrityunjay Mantra: శ్రావణ మాసంలో మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ మంత్రాన్ని జపించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. దాని ప్రకారం చేస్తేనే మీకు పుణ్యం లభిస్తుంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 17, 2022, 06:42 PM IST
Mahamrityunjay Mantra: మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడంలో ఈ తప్పులు చేయకండి!

Mahamrityunjay Mantra Vidhi: శ్రావణ మాసం మెుదలైంది. ఇది హిందువులకు చాలా పవిత్రమైన మాసం. ఈ నెలలో భక్తులు శివుడిని (Lord Shiva) పూజిస్తారు. ఈ మాసంలో శివారాధన చేసేటప్పుడు మహామృత్యుంజయ మంత్రం జపిస్తే అకాల మృత్యుభయం తప్పుతుంది. దీంతోపాటు భక్తులకు దీర్ఘాయువు లభిస్తుంది. అయితే మహామృత్యుంజయ మంత్రాన్ని (Mahamrityunjay Mantra) జపించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. లేకపోతే అనర్థం జరగవచ్చు. ఇప్పుడు మహామృత్యుంజయ మంత్ర విధానం గురించి తెలుసుకుందాం 

మహామృత్యుంజయ మంత్రం
ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
 ఉర్వారుక మివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ 

మంత్రం పఠించేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి
>> మహామృత్యుంజయ మంత్రాన్ని కింద కూర్చుని జపించకూడదు. ఎత్తైన ఆసనంపై కూర్చుని మాత్రమే ఈ మంత్రాన్ని పఠించాలి. దీని కోసం ఒక మంచి స్థలాన్ని ఎంచుకోండి. రోజూ అక్కడే కూర్చుని మంత్ర జపం చేయండి. 
>> ఈ మంత్రాన్ని జపించేటప్పుడు, మీ ముఖం ఎల్లప్పుడూ తూర్పు వైపు ఉండాలని గుర్తుంచుకోండి. అంతేకాకుండా మంత్రాన్ని పూర్తి ఏకాగ్రతతో పఠించాలి.  
>> మీరు మహామృత్యుంజయ మంత్రాన్ని ఎన్ని రోజులు జపిస్తారో.. అన్ని రోజులు మాంసం, మద్యం ముట్టకూడదు.
>> మహామృత్యుంజయ మంత్రాన్ని జపించేటప్పుడు ధూప దీపాలు మొదలైన వాటిని నిత్యం వెలిగిస్తూ ఉండాలి.
>> ఈ మంత్రాన్ని రుద్రాక్ష మాలతోనే జపించాలి.
>>  శివుని విగ్రహం లేదా మహామృత్యుంజయ యంత్రం ఉంచిన ప్రదేశంలో ఈ మంత్రాన్ని జపించండి.
>> మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూనే.. పాలు కలిపిన నీటితో శివలింగానికి అభిషేకం చేస్తూ ఉండండి.

Also Read: Samsaptak Yog: శని-సూర్యుడు సంసప్తక యోగం... ఈ 4 రాశుల వారికి డబ్బే డబ్బు.. 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News