Solar Eclipse On Shani Transit Day 2025: జ్యోతిషశాస్త్రంలో శని గ్రహ సంచారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే హిందూ పురాణాల ప్రకారం, సూర్య గ్రహణానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ప్రస్తుతం శని గ్రహం కుంభ రాశిలో 2025 సంవత్సరం వరకు సంచార క్రమంలో ఉంటుంది. అలాగే ఈ గ్రహం తిరోగమనంలో కూడా ఉంది. అలాగే 2025 సంవత్సరంలో బృహస్పతి గ్రహం కూడా సంచారం చేస్తుంది. వచ్చే ఏడాది ఇతర పెద్ద గ్రహాలు కూడా సంచారం చేస్తాయి. దీని కారణంగా 12 రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే వచ్చే సంవత్సరంలో శని సంచారంతో పాటు సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
2025 సంవత్సరంలో మార్చి 29 రాత్రి 11:01 గంటలకు శని గ్రహం సంచారం చేయబోతోంది. ఈ సమయంలో కుంభ రాశి నుంచి మీన రాశిలోకి సంచారం చేయబోతోంది. ఈ గ్రహం మీన రాశిలో దాదాపు రెండు సంవత్సరాల ఐదు నెలల పాటు ఉంటుంది. అలాగే ఈ రోజే సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతోంది. దీని కారణంగా శని గ్రహ సంచారానికి ఎంతో ప్రత్యేకత సంతరించుకుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సంచారం కారణంగా ఏయే రావులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకోండి.
2025 ఏడాది అదృష్ట రాశి ఫలితాలు:
1. సింహ రాశి:
సూర్యగ్రహణం రోజున శని సంచారం చేయడం కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. దీని కారణంగా సింహ రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో సింహ రాశివారికి అన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. దీంతో పాటు వీరికి ధైర్యం లభిస్తుంది. అంతేకాకుండా జీవితంలో కూడా ఎలాంటి సమస్యలైనా పరిష్కారమవుతాయి. అలాగే ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయంలో విపరీతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆదాయం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి.
2. తులారాశి:
తులా రాశి వారికి ఎల్లప్పుడు శని అనుగ్రహం లభిస్తుంది. దీని కారణంగా జీవితంలో సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారమవుతాయి. అలాగే ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే ఈ 2025 ఏడాదిలో కష్టానికి తగిన ప్రతిఫలం కూడా ఎంతో సులభంగా లభిస్తుంది. దీంతో పాటు వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం ఎంతో లాభదాయంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం ఎంతో లాభాదయంగా ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
3. మీనరాశి:
మీన రాశివారికి కూడా ఈ 2025 సంవత్సరం ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే వీరికి భౌతిక ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. దీంతో పాటు సంతోషం కూడా పెరుగుతుంది. అలాగే వీరికి కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. దీని కారణంగా సంపదలో విపరీతమైన మార్పులు వస్తాయి. అలాగే అనుకున్న పనులు కూడా జరిగిపోతాయి. దీంతో పాటు ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా డబ్బులు కూడా విపరీతంగా పోగు చేస్తారు.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి