Solar Eclipse 2023 & Earthquake: ఏప్రిల్ 20న తొలి తొలి సూర్య గ్రహణం.. ఈలోగా భూకంపం.. గ్రహణానికి భూకంపానికి సంబంధం ఉందా..?

Relation Between Solar Eclipse 2023 & Earthquake: హిందూ జ్యోతిష్య శాస్త్రాల నమ్మకాల ప్రకారం సూర్య, చంద్ర గ్రహణాలకు అమితమైన ప్రాధాన్యత ఉంది. అంతేకాకుండా గ్రహణాలకు ప్రకృతి విపత్తులైన భూకంపాలకు సంబంధముందంటున్నారు జ్యోతిష్య పండితులు. ఇది ఎంతవరకూ నిజమో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 22, 2023, 06:40 PM IST
Solar Eclipse 2023 & Earthquake: ఏప్రిల్ 20న తొలి తొలి సూర్య గ్రహణం.. ఈలోగా భూకంపం..  గ్రహణానికి భూకంపానికి సంబంధం ఉందా..?

Connection Between Solar Eclipse 2023 & Earthquake: ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం ఏప్రిల్ 20వ తేదీ గురువారం నాడు ఏర్పడనుంది. సరిగ్గా 15 రోజుల విరామంలో చంద్ర గ్రహణముంది. ఏదైనా గ్రహణానికి 40 రోజులు అటూ ఇటులో భూకంపం రావడం కన్పిస్తుంటుంది. అసలు ఈ రెండింటికీ మధ్య సంబంధమేంటో తెలుసుకుందాం..

హిందూమత విశ్వాసాల ప్రకారం గ్రహణానికి విశేష ప్రాధాన్యత ఉంది. సూర్యుడికి భూమికి మధ్యన చంద్రుడు రావడం వల్ల సూర్య గ్రహణం ఏర్పడుతుంటుంది. ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం ఏప్రిల్ 20న ఉంది. జ్యోతిష్యశాస్త్రంలో చాలా ఉపాయాలున్నాయి. ఈ ఉపాయాలు ఆచరిస్తే గ్రహణం నెగెటివ్ ప్రభావాన్ని తగ్గించవచ్చంటారు.

సూర్య గ్రహణం ప్రభావం భూమిపై పడుతుందనేది కొందరి వాదన. చంద్ర గ్రహణం సమయంలో నీరు, సముద్రంపై ఆ ప్రభావం పడుతుందట. రానున్న ప్రకృతి విపత్తుల గురించి గ్రహణాలు సంకేతాలిస్తాయంటారు. ఈ సందర్భంగా జంతు జీవాలు తీవ్ర అసౌకర్యానికి లోనవుతాయి. జ్యోతిష్యం ప్రకారం సూర్య గ్రహణం సమయంలో ఆ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో భూకంపం ముప్పు పెరిగిపోతుంది. 

సూర్య గ్రహణంతో భూకంపానికి ఉన్న సంబంధమేంటి..?

ఏదైనా గ్రహణం ఏర్పడినప్పుడు అంతకు 40 రోజులు ముందు గానీ తరువాత గానీ అంటే 80 రోజుల అంతరంలో భూకంపం ఏ క్షణంలోనైనా రావచ్చనేది ఓ సంకేతం. చాలా సందర్భాల్లో ఇలా జరిగింది. సూర్య గ్రహణానికి 15 రోజులు ముందు లేదా తరువాత భూకంప ప్రకంపనలు నమోదయ్యాయి.

సూర్య గ్రహణం తరువాత దేశం, భూమికి సంబంధించిన విపత్తులు ఏర్పడతాయి. చంద్ర గ్రహణం సందర్భంగా సముద్ర విపత్తు అంటే నీటికి సంబంధించిన విపత్తు పెరగవచ్చు. అందుకే చాలా సందర్భాల్లో సునామీ వంటి ఘటనలు ఎదురౌతాయి.

Also Read: Ugadi Festival 2023: ఉగాది రోజు ఈ ప్రత్యేక వస్తువును ఇంటికి తీసుకెళ్లండి.. ఏడాదంతా డబ్బేడబ్బు! మంచి ఆరోగ్యం

Also Read: PM KISAN Samman Nidhi Yojana Scheme: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ అప్‌డేట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News