Shukra Rashi Parivartan 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు సంచారం చేస్తాయి. సమయాన్ని బట్టి కొన్ని గ్రహాలు సంచారం చేస్తే..మరికొన్ని గ్రహాలు తిరోగమనం చేస్తాయి. ఇక జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహానికి ఎంత ప్రాముఖ్య ఉందో తెలిసిందే..ఈ గ్రహాన్ని ఆనందం, సంపద, వైభవం, ఐశ్వర్యంకు సూచికగా పరిగణిస్తారు. ఈ గ్రహం ఒక రాశిలో సంచారం చేసిన తర్వాత దాదాపు 23 రోజుల పాటు సంచార క్రమంలోనే ఉంటుంది. అయితే ఇప్పుడు శుక్రుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. అక్టోబర్ 2వ తేదీ అర్ధరాత్రి 12.43 గంటలకు సింహరాశిలోకి సంచారం చేయబోతోంది. దీంతోన్ని అక్టోబర్ 2 నుంచి కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. శుక్రుడి సంచారం ప్రభావం వల్ల ఏయే రాశుల వారి జీవితాలు మారతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి:
వృషభ రాశి వారికి శుక్రుడు 9వ స్థానంలో ఉండబోతోంది. దీని కారణంగా ఈ రాశివారికి శుక్రుడి అనుగ్రహం లభించి..మంచి లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమయంలో కొత్త ఇల్లు లేదా వాహనాలు కూడా కొనుగోలు చేసే ఛాన్స్‌లు ఉన్నాయి. దీంతో పాటు వీరు కొత్త ఆదాయ వనరులు కూడా కనుగొంటారు. ఆర్థిక స్థిరత్వం పొందే ఛాన్స్‌లు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా వీరు భవిష్యత్‌లో కొత్త సంబంధాలు కూడా పొందుతారు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
మేష రాశి:
మేషరాశి వారికి ఈ సంచారం జాతకంలో 5వ స్థానంలో జరుగుతోంది. వీరు ఈ సమయంలో కుటుంబ సభ్యులతో మంచి ఆనందకరమైన జీవితాన్ని గడిపే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. దీంతో పాటు ఆర్థికంగా లాభాలు పొందుతూ వ్యాపారాల్లో పెట్టుబడులు కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆర్థిక సమస్యలతో బాధపడేవారికి ఖర్చులు తగ్గి కొత్త ఆదాయ వనరులు పొందే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. దీంతో పాటు వీరు అనేక రకాల కొత్త బాధ్యతలు పొందే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా సుదూర ప్రయణాలు చేసే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.
సింహ రాశి:
సింహరాశి వారికి శుక్రుని సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశివారికి శుక్రుడు జాతకంలో మొదటి స్థానంలో సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా వీరికి అదృష్టం రెట్టింపు అయ్యే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా వీరిపై వీరికి ఆత్మవిశ్వాసం పెరిగి పెట్టుబడుల్లో విజయాలు సాధిస్తారు. ఇక వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో అనేక లభాలు కలుగుతాయి.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి