Shukra Ast 2023: చాలా రోజుల తర్వాత ఈ రాశులవారు భారీ లాభాలు పొందబోతున్నారు.!

Shukra Ast 2023: శుక్రుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 9, 2023, 10:13 AM IST
Shukra Ast 2023: చాలా రోజుల తర్వాత ఈ రాశులవారు భారీ లాభాలు పొందబోతున్నారు.!

 

Shukra Ast 2023: ఆగష్టు 7న శుక్రుడు కర్కాటక రాశిలోకి సంచారం చేశాడు. అయితే ఇదే గ్రహంలో దాదాపు 23 రోజుల పాటు ఉండబోతోంది. ఆగస్టు 7 నుంచి అక్టోబర్ 2 వరకు శుక్రుడు కర్కాటక రాశిలోనే ఉంటాడు. కాబట్టి శుక్రుడి ప్రభావం కొన్ని రాశులవారిపై కొంతైన పడే ఛాన్స్‌ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సంచారం కారణంగా ఏయే రాశులవారు ఎలాంటి లాభాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ రాశులవారిపై ప్రత్యేక ప్రభావం:
వృషభ రాశి:

శుక్రుడు సంచారం కారణంగా ఈ రాశివారికి మంచి రోజు ప్రారంభం కాబోతున్నాయి. వృషభ రాశివారికి వైవాహిక జీవితంలో కూడా సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ క్రమంలో సులభంగా ఉపశమనం లభిస్తుంది. ఇక వీరు కెరీర్‌లో మంచి స్థానంలో ఉండేందుకు ఈ సమయంలో కష్టపడితే మంచి ఫలితాలు పొందుతారు. 

కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారి జీవితంలో ఈ సంచారం కారణంగా భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ సమంలో మీకు విశ్వాసం పెరుగుతుంది. పాటు పెట్టుబడుల్లో నుంచి వీరు భారీ లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఈ క్రమంలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని లాభాలు పొందుతారు. మీ తల్లిదండ్రులు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే సులభంగా ఉపశమనం లభిస్తుంది. ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. 

Also Read: Gaddar Cremation:గద్దర్ అంత్యక్రియల్లో అపశృతి.. తొక్కిసలాటలో సీనియర్ జర్నలిస్ట్ మృతి

సింహ రాశి:
సింహ రాశి వారికి శుక్రుడి సంచారం కారణంగా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. వృత్తి జీవితాన్ని గడుపుతున్నవారికి ఈ క్రమంలో భారీ లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆదాయం పెరిగి ఖర్చులు కూడా తగ్గుతాయి. అయితే కొన్ని విషయాల్లో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 

వృశ్చిక రాశి:
శుక్రుడు సంచారం కారణంగా వృశ్చిక రాశివారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడడమే కాకుండా వ్యాపారాలు చేస్తే భారీ లాభాలు పొందుతారు. అయితే ఈ క్రమంలో తప్పకుండా ఖర్చులను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయి. 

Also Read: Gaddar Cremation:గద్దర్ అంత్యక్రియల్లో అపశృతి.. తొక్కిసలాటలో సీనియర్ జర్నలిస్ట్ మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News