Lucky Zodiac Sign: శ్రావణ మాసంలో లక్కీ రాశులు ఇవే.. మీది ఉందా?

Sawan 2023: వచ్చే నెలలో శ్రావణ మాసం ఆరంభం కానుంది. 19 ఏళ్ల తర్వాత ఈ శ్రావణ మాసం రెండు నెలలపాటు ఉండనుంది. ఇది కొన్ని రాశులవారికి కలిసి రానుంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.   

Written by - Srisailam | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 25, 2023, 01:41 PM IST
Lucky Zodiac Sign: శ్రావణ మాసంలో లక్కీ రాశులు ఇవే.. మీది ఉందా?

Shravan 2023 Lucky Zodiac Sign in Telugu: హిందువులకు శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది. ఈ మాసం శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది. వర్షాకాల ఆరంభ సమయంలో ఈ నెల మెుదలవుతుంది. ఈ ఏడాది శ్రావణ మాసం జూలై 04, మంగళవారం నుండి ప్రారంభం కానుంది. 19 ఏళ్ల తర్వాత ఈ శ్రావణ మాసం రెండు నెలలపాటు ఉండనుంది. 59 రోజులపాటు ఉండే ఈ మాసం 5 రాశులవారికి ప్రత్యేకం కానుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.

వృషభం
శ్రావణ మాసం వృషభ రాశి వారికి చాలా శుభప్రదమైనది. మీరు కెరీర్ లో వృద్ధిని సాధిస్తారు. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీకు కోరుకున్న ధనం లభిస్తుంది. మీ ప్రేమ లేదా వైవాహిక జీవితం బాగుంటుంది. 
మిధునరాశి
మిథునరాశి వారికి శ్రావణ మాసం చాలా అదృష్టమనే చెప్పాలి. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. మీరు కోరుకున్న చోటుకి ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంది. 
సింహరాశి 
శ్రావణ మాసం సింహ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలను ఇస్తుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీ జీవితం బాగుంటుంది. మీరు ఊహించని స్థాయికి ఎదుుగుతారు. మీ ఆదాయం డబల్ అవుతుంది. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది. 

Also Read: Budh Gochar 2023: పవిత్రమైన యోగం చేస్తున్న బుధుడు.. ఈ 3 రాశుల బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం పక్కా...

తులారాశి
శ్రావణ మాసం తులారాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. మీ జీవితంలో ప్రేమ ఉంటుంది. మీ కోరికలు ఫలిస్తాయి. మీకు ఉద్యోగం వస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. 
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉంటాయి. మీరు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీరు ఆర్థికంగా బలపడతారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ సర్వసుఖాలు లభిస్తాయి. 

Also Read: Mars transit 2023: జూలై 1 నుండి ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News