Sharad Navratri 2023: అష్టమి నాడు అరుదైన సంయోగం, 4 రాశులకు 24 గంటల్లో రాజయోగం

Sharad Navratri 2023: హిందూమతంలో శరద్ నవరాత్రులు, లేదా దసరాకు చాలా ప్రాధాన్యత, మహత్యముంటుంది. ఈ పండుగను ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా జరుపుకుంటారు. ఈసారి నవరాత్రికి మరో ప్రత్యేకత, అరుదైన సందర్భం ఉందంటున్నారు జ్యోతిష్య పండితులు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 21, 2023, 08:41 AM IST
Sharad Navratri 2023: అష్టమి నాడు అరుదైన సంయోగం, 4 రాశులకు 24 గంటల్లో రాజయోగం

Sharad Navratri 2023: ఈ ఏడాది శరద్ నవరాత్రుల్లో అష్టమి రోజు చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఆ రోజు అద్భుతమైన సంయోగం ఏర్పడనుంది. రేపు అంటే అక్టోబర్ 22న మహాష్టమి చాలా యోగాలకు కారకంగా నిలవనుంది. ఫలితంగా ఈ రాశులవారికి అదృష్టం తలుపుతట్టి పలకరించనుంది. 

శరద్ నవరాత్రుల్లో దుర్గాదేవి పూజలకు విశేష ప్రాధాన్యత ఉంది. అందుకే నవరాత్రులు ప్రారంభం కాగానే అన్ని ప్రాంతాల్లో దుర్గాదేవి పూజలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బతుకమ్మకు, కొన్ని ప్రాంతాల్లో లక్ష్మీదేవికి, ఇంకొన్ని ప్రాంతాల్లో కాళికాదేవి, కొన్నిచోట్ల అంబాదేవికి పూజలు చేస్తారు. ఆలయాల్లో భక్తుల సందడి పెరుగుతోంది. రేపు అక్టోబర్ 22వ తేదీన మహాష్టమి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ సమయంలో కొన్ని ప్రాంతాల్లో కులదేవతకు కూడా పూజలు జరుగుతుంటాయి. ఈసారి అష్టమి తిధిన శుభయోగం ఏర్పడనుంది. శరద్ నవరాత్రి అష్టమి తిధి రోజు శుభయోగం ఏర్పడటం చాలా అరుదుగా జరిగే పరిణామం. చాలా ఏళ్ల తరువాత జరగడంతో విశేషమైన ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు ఇదే రోజు అష్టమి నాడు స్వార్ధ సిద్ధి యోగం, రవి యోగం ఉంటుంది. ఇన్ని రాజయోగాల శుభ సంయోగం మహాష్టమి నాడు ఏర్పడటం దాదాపు 100 ఏళ్లకు జరిగింది. ఫలితంగా కొన్ని రాశులకు శుభప్రదంగా ఉంటుంది. కొన్ని రాశులకు అదృష్టం తెర్చుకుంటుంది.

కర్కాటక రాశి జాతకులకు శుభప్రదంగా ఉంటుంది. పెండింగులో ఎక్కడైనా డబ్బులు నిలిచిపోతే ఆ డబ్బులు తిరిగి చేతికి అందుతాయి. ఫలితంగా ఆర్ధికంగా పటిష్టమైన స్థితిని కలిగి ఉంటారు. వ్యాపారులకు మంచి సమయం. విశేషమైన లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లేదా పదోన్నతి ఉంటుంది. 

మీన రాశి జాతకులకు ఈ సమయం అత్యంత అనుకూలమైంది. ఈ జాతకులకు పదవీ ప్రతిష్ట రెండూ లభిస్తాయి. ఆకశ్మిక ధనలాభం కలుగుతుంది. వ్యాపారులకు అంతులేని ధనలాభం ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా కొత్త ఉద్యోగావకాశాలుంటాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. 

మేష రాశి జాతకులకు అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించి శుభవార్తలు వింటారు. కెరీర్‌పరంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఉద్యోగులకు పదోన్నతి ఉంటుంది. కొంతమందికైతే కొత్త ఉద్యోగావకాశాలు ఉంటాయి.

వృషభ రాశి జాతకులకు పనిచేసేచోట గౌరవ మర్యాదలు లభిస్తాయి. కుటుంబ జీవితంలో ప్రశాంతత ఉంటుంది. సిబ్బంది సహకారం సంపూర్ణంగా లభిస్తాయి. వ్యాపారులు విశేషమైన లాభాలు ఆర్దిస్తారు. షేర్ మార్కెట్ పెట్టుబడులు కలిసొస్తాయి. ఆర్ధిక పరిస్థితి అద్బుతంగా ఉంటుంది. ఉద్యోగులకు కూడా అనువైన సమయం.

Also read: Sun Transit 2023: సూర్యుడి గోచారంతో ఈ 3 రాశులకు నవంబర్ 17 వరకు పట్టిందల్లా బంగారం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News