Conjunction Of Saturn And Venus: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, గ్రహాలు కాలానుగుణంగా రాశిచక్రాలను మార్చడం ద్వారా ఇతర గ్రహాలతో పొత్తులు పెట్టుకుంటాయి. దీని ప్రభావం మానవ జీవితంపై మరియు భూమిపై కనిపిస్తుంది. ఈ గ్రహాల సంయోగం కొందరికి అశుభకరంగానూ, కొందరికి శుభకరంగానూ ఉంటుంది. 30 సంవత్సరాల తర్వాత శనిదేవుడు కుంభరాశిలో సంచరించాడు. ఈరోజు అంటే జనవరి 22 మధ్యాహ్నం 2 గంటలకు శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. కుంభరాశిలో ఈ రెండు రాశుల కలయిక మూడు రాశులవారికి భారీ మెుత్తంలో ధనాన్ని ఇవ్వనుంది. ఆ రాశులేవో తెలుసుకుందాం.
శని-శుక్ర సంయోగం ఈ రాశులకు వరం
మకర రాశిచక్రం
శని మరియు శుక్రుల కలయిక మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో రెండవ ఇంట్లో ఈ కూటమి ఏర్పడుతోంది. దీంతో మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వ్యాపారం విస్తరిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీకు కొత్త అవకాశాలు వస్తాయి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మెుత్తానికి ఈ సమయం మీకు శుభప్రదంగా ఉంటుంది.
మేష రాశిచక్రం
శని మరియు శుక్రుల కలయిక మేష రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి 11వ ఇంట్లో ఈ కూటమి ఏర్పడబోతోంది. మీ కోరికలు నెరవేరుతాయి. మీ జీవితంలో సుఖాలు పెరుగుతాయి. వ్యాపారవేత్తల ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సమకూరుతుంది. మీరు స్టాక్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీలో డబ్బు పెట్టుబడి పెట్టడం వల్ల మీరు లాభం పొందుతారు.
వృషభ రాశి
శని మరియు శుక్రుల కలయిక మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి తొమ్మిదవ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతోంది. ఈ సమయంలో మీ అదృష్టం ప్రకాశిస్తుంది. వ్యాపారం నిమిత్తం మీరు టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. విద్యార్థులకు ఈ సమయం బాగుంటుంది. మీరు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. మీరు కొత్త వాహనం కొనాలనే కోరిక నెరవేరుతుంది. ఇంటి అవసరాలకు సంబంధించిన ఏవైనా లగ్జరీ వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది.
Also Read: Shukra Mahadasha effect: 20 ఏళ్లపాటు ఉండే శుక్ర మహాదశ.. మీపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి