Shani Nakshatra Parivartan: జ్యోతిష్య శాస్త్రంలో శనిదేవుడిన్ని, గ్రహాన్ని న్యాయమూర్తిగా పరిగణిస్తారు. కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి కర్మదేవుడిగా కూడా పిలుస్తారు. సంవత్సరంలో చివరి, రెండవ చంద్ర గ్రహణానికి ముందు శని గ్రహం సంచారం చేయబోతోంది. అక్టోబర్ 15న ధనిష్ఠ నక్షత్రంలోకి ఈ గ్రహం సంచారం చేయబోతోంది. నవంబర్ 24 వరకు శని ఈ నక్షత్రంలో ఉండి ఆ తర్వాత శతభిష నక్షత్రంలోకి సంచారం చేయనుంది.
శని గ్రహం ఇతర గ్రహాలతో పోలిస్తే చాలా నెమ్మదిగా సంచారం చేస్తుంది. దీని ప్రభావం కూడా అన్ని రాశులవారిపై కూడా చాలా నెమ్మదిగా పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ విధంగా శని ఒక రాశి సంచారం పూర్తి చేయడానికి సుమారు 30 సంవత్సరాలు పడుతుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారిపై ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మిథున రాశి:
ధనిష్ఠ నక్షత్రంలో శని సంచారం చేయడం వల్ల మిథున రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. శనిదేవుని అనుగ్రహం వల్ల విజయం సాధిస్తారు. దీని కారణంగా ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు వీరికి సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
కన్యారాశి:
శని గ్రహం రాశుల మార్పుల కారణంగా కన్య రాశి వారికి శుభప్రదంగా మారబోతోంది. ఈ సమయంలో మనస్సు సంతోషంగా మారుతుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. దీంతో పాటు ప్రణాళికలు విజయవంతమవుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా గడపే అవకాశాలు కూడా ఉన్నాయి.
తుల రాశి:
ధనిష్ఠ నక్షత్రంలోకి శని ప్రవేశించడం వల్ల తులారాశి వారికి చాలా శుభప్రదంగా మారబోతోంది. అంతేకాకుండా ఈ సమయంలో వీరు శుభవార్తలను కూడా వింటారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్నవారికి ఎంతో ఫలప్రదంగా ఉంటుంది. ఉన్నతాధికారులు మీ పనిని చూసి ఆకట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..