Shani Jayanti 2023: శని జయంతి రోజు ఈ ఉపాయాలు పాటిస్తే శని దోషం, దుష్ప్రభావాల్నించి ఉపశమనం

Shani Jayanti 2023: జ్యోతిష్యాన్ని నమ్మేవారికి శని గ్రహం అంటే చాలా భయం. గ్రహాల గోచారం, రాశి పరివర్తనంలో భాగంగా శని గ్రహం గోచారం ఏ రాశులపై ఎలా ఉంటుందోననే భయం వెంటాడుతుంటుంది. అందుకే శనిగ్రహం కోపం నుంచి రక్షించుకునే ఉపాయాలు అణ్వే,షిస్తుంటారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 4, 2023, 06:08 AM IST
Shani Jayanti 2023: శని జయంతి రోజు ఈ ఉపాయాలు పాటిస్తే శని దోషం, దుష్ప్రభావాల్నించి ఉపశమనం

Shani Jayanti 2023: హిందూ ధర్మశాస్త్రంలో శనిగ్రహానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. మిగిలిన గ్రహాల్లా కాకుండా శని గ్రహానికి జయంతి కూడా చేస్తుంటారు. అదే శని జయంతి. ఇది చాలా ప్రత్యేకమైంది. విశిష్టమైంది. శని ప్రభావం నుంచి విముక్తి పొందేందుకు మంచి అవకాశం కూడా.

శని దోషం, శని ప్రభావం నుంచి కాపాడుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. హిందూ పంచాంగం ప్రకారం మే 19వ తేదీన శని జయంతి ఉంది. ఈ రోజున కొన్ని ఉపాయాలు ఆచరిస్తే శని దోషం లేదా శని దుష్ప్రభావం నుంచి కాపాడుకోవచ్చు. ముఖ్యంగా 5 రాశులవారికి చాలా ఇబ్బందులు కలుగుతుంటాయి. శని ప్రభావంతో ఈ 5 రాశుల పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయుంటాయి. జ్యోతిష్య పండితుల ప్రకారం శని దోషం కలిగినవాళ్లు ఆ దోషాన్ని తగ్గించేందుకు శని జయంతి అద్భుతమైన అవకాశంగా భావిస్తారు. ప్రస్తుతం మకరం, కుంభం, మీనం, కర్కాటకం, వృశ్చిక రాశులపై శని ప్రభావం నడుస్తోంది. శనిగ్రహం ఆగ్రహం కారణంగా లాజికల్ కెపాసిటీ తగ్గిపోతుంది. అశాంతి ఆవహిస్తుంది. అందుకే శని దుష్ప్రభావం నుంచి తప్పించుకునే మార్గాల గురించి తెలుసుకుందాం..

కర్కాటక రాశి

కర్కాటక రాశి జాతకులపై శని దోషం నడుస్తోంది. ఆందోళన, అశాంతితో ఉండటం వల్ల ఆలోచించే సామర్ద్యం తగ్గిపోతుంది. లాజికల్ ఆలోచనలుండవు. శని జయంతి రోజున శని దేవుడిని నువ్వుల నూనెతో దీపం వెలిగించి పూజలు చేస్తే శని ఆగ్రహం తగ్గుతుందని విశ్వాసం. శని జయంతి రోజున ఇలా చేసిన తరువాత ప్రతి శనివారం ఇది కొనసాగించాలి.

వృశ్చిక రాశి

శని దోషం నుంచి కాపాడుకునేందుకు శని జయంతి రోజున శనీశ్వరాలయానికి వెళ్లి విధి విదానాలతో పూజలు చేయాలి. దీనివల్ల శని ప్రభావం తగ్గుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో కలిగే నష్టాల్నించి తప్పించుకోవచ్చు. కుటుంబసభ్యులతో బంధాలు బలహీనమౌతాయి. 

మకర రాశి

మకర రాశి జాతకులు శని దోషం లేదా శని దుష్ప్రభావం నుంచి కాపాడుకునేందుకు శని దేవుడి పూజ తప్పకుండా చేయాలి. శని జయంతి మే 19న శని స్తోత్రం తప్పకుండా పఠించాలి. లేకుంటే శని ప్రభావం కారణంగా ఖర్చులు అకారణంగా పెరిగిపోతుంటాయి. ఆరోగ్యం పాడౌతుంది. 

కుంభ రాశి

కుంభ రాశి జాతకులు శని జయంతి రోజున శని దేవుడికి పూజలు చేయాలి. ఇలా చేయడం వల్ల శని దోషంతో ఎదుర్కొంటున్న సమస్యల్నించి ఉపశమనం కలుగుతుంది. శని జయంతి రోజున బీజ మంత్రం జపించడం వల్ల జీవితంలో నిలిచిపోయిన పనులు తిరిగి సాఫీగా కొనసాగించుకోవచ్చు. 

మీన రాశి

మీన రాశి జాతకులు శని దోషం నుంచి కాపాడుకునేందుకు శని జయంతి రోజున శనీశ్వరాలయానికి వెళ్లి షమీ ఆకుల్ని శని దేవుడికి సమర్పించాలి. శని దోషం కారణంగా మీన రాశి జాతకుల ఆరోగ్యం పాడవుతుంది. భార్యా భర్తల మధ్య వివాదం పెరిగి పెద్దదౌతుంది. ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆరోగ్యం సరిగ్గా ఉండదు. ఈ సమస్యల్నించి విముక్తి పొందేందుకు శని జయంతి రోజున ప్రత్యేక పూజలు చేయాల్సిందే.

Also read: Budh Surya yuti 2023: అరుదైన బుధాదిత్య యోగం.. ఈ 5 రాశులకు ఊహించనంత ధనం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News