Shani Dev: నవంబర్ 4 నుంచి ఈ రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు!

Shani Margi 2023: నవంబర్ 4వ తేదిన శని గ్రహం తిరోగమనం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారు ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా బలపడే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 21, 2023, 10:56 AM IST
Shani Dev: నవంబర్ 4 నుంచి ఈ రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు!

 

Shani Margi 2023:  ప్రతి గ్రహం ఏదో ఒక సమయంలో రాశి సంచారం చేస్తుంది. కొన్ని గ్రహాలు ప్రత్యేక సమయాల్లో సంచారం చేస్తే మరికొన్ని గ్రహాలు మాత్రం ప్రతి నెల సంచారం చేస్తాయి. కానీ శని గ్రహం చాలా అరుదుగా సంచారం, తిరోగమనం చేస్తుంది. 5 నెలల తర్వాత శని గ్రహం నవంబర్ 4న రాశి సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుతం శని గ్రహం కుంభ రాశిలో స్థిరంగా ఉన్నాడు. నవంబర్ 4వ తేదిన తిరోగమనం చేయబోతున్నాడు. అయితే శని తిరోగమనం కారణంగా ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు, దుష్ప్రభావాలు కలుగాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఈ రాశులవారిపై శని ప్రభావం:
వృషభ రాశి:

శని గ్రహం ప్రత్యేక్ష సంచారం కారణంగా వృషభ రాశి వారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రాశి వారికి ఆర్థికంగా లాభపడే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో భవిష్యత్‌ కోసం కొత్త అవకాశాలు కూడా పొందే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త అందుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయి.

సింహం రాశి:
సింహ రాశి వారికి శని ప్రత్యక్ష సంచారం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. సింహ రాశి వారికి అదృష్టం అనుకూలిస్తే వారి కష్టాలు సులభంగా తీరిపోతాయి. అంతేకాకుండా  మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్ధతు లభిస్తుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఉన్నతాధికారుల మద్దతు లభించి ఊహించని లాభాలు కూడా కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఆర్థిక అభివృద్ధి కూడా సులభంగా పెరుగుతుంది. కుటుంబ జీవితం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మద్ధతు లభించి ఊహించని లాభాలు కలుగుతాయి. 

Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడంటే..?  

కుంభ రాశి:
కుంభ రాశి వారికి శని ప్రత్యక్షంగా ఉండడం వల్ల ఈ సమయంలో చాలా మేలు జరుగుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో ధైర్యం, విశ్వాసం పెరిగి అనేక ప్రయోజనాలు పొందే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. దీంతో పాటు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేవారికి పనిలో కూడా విజయం కలుగుతుంది. అంతేకాకుండా ఆర్థికంగా లాభాలు కలిగే ఛాన్స్‌లు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడంటే..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News