Shani Sadesati & Dhaiya:: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శనిదేవుడు క్రూరమైన గ్రహం. ఈ కలియుగంలో శని దేవుడిని న్యాయ దేవుడు అంటారు. మనుషుల కర్మలను బట్టి ఫలాలను ఇస్తాడు కాబట్టి ఈయనను కర్మదాత అని కూడా పిలుస్తారు. శని దేవుడి అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. శని కోపానికి గురైతే ధనవంతుడు కూడా దరిద్రుడిగా మారుతాడు. ఎవరిపై శనిమహాదశ కొనసాగుతుందో వారు అనేక ఇబ్బందులను ఎదుర్కోంటారు. అయితే మూడు రాశులవారిపై సాడే సతి (Shani Sade Sati) మరియు ధైయా కొనసాగుతున్న కూడా వారిని శనిదేవుడు ఇబ్బంది పెట్టడు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
మకరరాశి (Capricorn): శని దేవుడికి ఇష్టమైన రాశి మకరం. అందుకే శనిదేవుడు ఈ రాశికి చెందిన వ్యక్తులను పెద్దగా ఇబ్బంది పెట్టడు. శని దేవుడు ఈ రాశిలో సంచరించినప్పుడు.. ఈ రాశి వారు అనేక ప్రయోజనాలు పొందుతారు.
తులారాశి (Libra); శనిదేవుడు తులారాశిలో ఉచ్ఛ స్థితిలో ఉంటాడు. అందుకే ఈ రాశివారిపై శనిసడే సతి లేదా ధైయా కొనసాగుతున్న సరే వీరిని పెద్దగా ఇబ్బంది పెట్టడు.
కుంభ రాశి (Aquarius): కుంభ రాశికి అధిపతి శనిదేవుడు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ రాశి వారికి శనిదేవుడు శుభప్రదంగా భావిస్తారు. సాడేసతి, ధైయా ప్రభావం ఇతర రాశుల వారిపై చూపినంతగా ఈ రాశివారిపై చూపదు.
శనిదేవుని పరిహారాలు
మీపై శని సడేసతి మరియు ధైయా కొనసాగుతున్నట్లయితే మీరు ఆర్థికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కోంటారు. మీరు దీని బయటపడటానికి ఆస్ట్రాలజీలో అనేక చిట్కాలు చెప్పబడ్డాయి.
**శనివారం శనిదేవుడిని భక్తి శ్రద్ధలతో పూజించండి.
**శని ఆలయంలో ప్రతి శనివారం ఆవనూనె దీపం వెలిగించండి.
**శనివారం ఉపవాసం ఉండి నల్ల నువ్వులను దానం చేయండి.
**శనివారం నల్ల కుక్కకు రొట్టె తినిపించండి.
Also read: Horoscope Today: ఇవాళ ఈ మూడు రాశులకు గుడ్ టైమ్ నడుస్తోంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook