Shani Amavasya 2022: ఈ రోజు మీ రాశి ప్రకారం ఈ చిన్న పనిచేయండి.. సమస్యలకు చెక్ పెట్టండి!

Shanichari Amavasya 2022: శనివారం శని దేవుడిని పూజిస్తారు. ఈరోజు అంటే ఆగష్టు 27న శని అమావాస్య. శనిదేవుని అనుగ్రహం పొందడానికి ఈ రోజున ఈ పరిహారాలు చేయండి.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 27, 2022, 10:52 AM IST
Shani Amavasya 2022: ఈ రోజు మీ రాశి ప్రకారం ఈ చిన్న పనిచేయండి.. సమస్యలకు చెక్ పెట్టండి!

Shanichari Amavasya 2022: ఆస్ట్రాలజీలో శనిదేవుడి అనుగ్రహం పొందడానికి అనేక రకాల పరిహారాలు చెప్పబడ్డాయి. శనివారం నాడు శనిదేవుడిని (ShaniDev) పూజించడం, నివారణలు చేయడం ద్వారా శనిదోషం నుండి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా సాడే సతి, ధైయా నుండి కూడా ఉపశమనం పొందుతారు. శనిదేవుడి ఆరాధించేటప్పుడు నల్ల నువ్వులు, ఆవనూనె, నీలిరంగు పువ్వులు ఉండేటట్లు చూసుకోండి. శనిమహాదశతో బాధపడుతున్నవారు శనివారాల్లో ఉపవాసం ఉండటం మంచిది.

మీ రాశిచక్రం ప్రకారం, శని దేవుడి యెుక్క ఈ మంత్రాలను జపించండి
మేషం - ఓం శాంతాయ నమః:
వృషభం - ఓం వరేన్నాయ నమః
మిథునం - ఓం మందాయ నమః
కర్కాటకం - ఓం సుందరాయ నమః:
సింహం - ఓం సూర్యపుత్రాయ నమః
కన్య - ఓం మహానేయగుణాత్మాన్నే నమః:
తులా - ఓం ఛాయాపుత్రాయ నమః
వృశ్చిక రాశి - ఓం నీలవర్ణాయ నమః
ధనుస్సు - ఓం ఘనసరవిల్లేపాయ నమః
మకరం - ఓం శర్వాయ నమః:
కుంభం - ఓం మహేశాయ నమః
మీనం - ఓం సుందరాయ నమః

మీ రాశిచక్రం ప్రకారం, శని దేవుడికి ఈ రెమెడీస్ చేయండి
మేషం- శివునికి ఇంట్లోనే రుద్రాభిషేకం చేయండి.
వృషభం - ఈ రోజున మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి.
మిథునరాశి - దశరథ మహారాజ ద్వారా రచించబడిన నీల శని స్తోత్ర పారాయణం పఠించండి.
కర్కాటకం - ఈరోజు నీడను దానం చేయండి. ఒక ఇనుప గిన్నెలో ఆవాల నూనె నింపి మీ ముఖం చూసి గిన్నెలోని నూనె దానం చేయండి.
సింహ రాశి- నల్ల నువ్వులు మరియు ఉల్లిని దానం చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుంది.
కన్య రాశి- శనిదేవుని బీజ్ మంత్రం 'ఓం ప్రాం ప్రిం ప్రూన్స్: శనిశ్చరాయ నమః' అని క్రమం తప్పకుండా జపించడం వల్ల శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది.
తులారాశి- శమీ వృక్షానికి క్రమం తప్పకుండా నీరు పోయడం ద్వారా శనిదేవుని అనుగ్రహం కురుస్తుంది.
వృశ్చికం - శనివారం లేదా క్రమం తప్పకుండా పేదలకు వీలైనంత సహాయం చేయండి.
ధనుస్సు - శని అమావాస్య, శనివారం లేదా శని జయంతి నాడు చీమలకు పంచదార లేదా గోధుమ పిండిని ఆహారంగా పెడితే శుభ ఫలితాలు కలుగుతాయి.
మకరం - దశరథ మహారాజు రచించిన నీల శని స్తోత్రాన్ని పఠించండి.
కుంభం- జ్యోతిష్య శాస్త్ర సలహాతో, ఈ రాశి వారు నీలమణిని ధరించాలి.
మీనం - చిన్న పిల్లలతో మంచిగా ప్రవర్తించండి మరియు మతపరమైన స్థలం యొక్క ప్రధాన ద్వారం శుభ్రం చేయడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి.

Also Read: Pithori Amavasya 2022: పిథోరి అమావాస్య ఎప్పుడు? దీని విశిష్టత ఏంటి? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News