Shani in Capricorn: శని గ్రహానికి సంబంధించి 2022 ఏడాది చాలా ప్రత్యేకం. ఏప్రిల్ 29 నుంతి శని రెండున్నరేళ్ల గోచారం ప్రారంభమైంది 30 ఏళ్ల పాటు కుంభరాశిలో ఉండే శని..వక్రావస్థలో మకరరాశిలో ప్రవేశించనున్నాడు. ఫలితంగా కొన్ని రాశులవారికి ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు పండితులు.
జూన్ 5, 2022 నుంచి శని వక్రమార్గంలో ఉంది. దీంతో కొన్ని రాశులకు అనుకూలంగా మరికొన్ని రాశులకు ప్రతికూలంగా మారుతోంది. కానీ వచ్చే నెల మరోసారి శని స్థితిలో గణనీయమైన మార్పు రానుంది. శని వక్రావస్థలో కుంభరాశి నుంచి బయటికొచ్చి..మకర రాశిలో ప్రవేశించనున్నాడు. జూలై 12వ తేదీన ఇది జరగనుంది. ఫలితంగా కొంతమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. శని వక్రావస్థ ప్రభావం ఏ రాశులపై ఉంటుందో తెలుసుకుందాం..
ఏప్రిల్ 29వ తేదీ నుంచి శనిగ్రహం కుంభరాశిలో ప్రవేశించిన తరువాత..మీనరాశివారికి దుష్ప్రభావం మొదటి దశ ప్రారంభమైంది. కుంభరాశివారికి రెండవ దశ మొదలైంది. అటు మకరరాశివారికి చివరిదశ నడుస్తోంది. ఫలితంగా అత్యంత క్లిష్టమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మకరరాశివారు. దీంతోపాటు కర్కాటక, వృశ్చిక రాశులవారిపై కూడా శని పీడ నడుస్తోంది.
జూలై 12 నుంచి ఈ రాశులకు కష్టకాలం
జూలై 12, 2022 నుంచి శని వక్రావస్థ ప్రారంభమై..మరోసారి మకర రాశిలో ప్రవేశించనున్నాడు శని. ఫలితంగా 2 నెలలుగా శని దుష్ప్రభావం నుంచి ఉపశమనం పొందుతున్న ధనస్సు రాశివారికి మరోసారి కష్టాలు ఎదురుకానున్నాయి. వీరికి 2023 జనవరి 17 వరకూ ఈ కష్టాలు, సమస్యలు తప్పవు. దాంతోపాటు శని వక్రావస్థలో మకరరాశిలో గోచారం చేయగానే తుల, మిధున రాశులపై కూడా శని పీడ ప్రారంభం కానుంది.
జూలై 12 నుంచి ఏ రాశులపై అయితే..శని దుష్ప్రభావం ప్రారంభమవుతుందో..ఆ రాశులవారు ఇప్పట్నించే కొన్ని ఉపాయాలు ఆచరించాల్సి ఉంది. శనివారం నాడు శని చాలీసా పఠించడం, శనీశ్వరాలయంలో ఛాయాదానం చేయడం, రావిచెట్టు కింద ఆముదం నూనెతో దీపం వెలిగించడం చేయాల్సి ఉంది. దీంతోపాటు మంచి పనులు కూడా చేయాలి. నిస్సహాయ, ఆపన్నులకు సహాయం చేయాలి. శని కర్మ ప్రకారం ప్రతిఫలమిస్తాడు. అందుకే మంచి పనులు చేయాలి.
Also read: Venus transit Effect: ఆ మూడు రాశులవారికి మరో ఆరు రోజుల్లో డబ్బే డబ్బు..
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook