Shani Dev uday 2023: వచ్చే వారంలో కీలక పరిణామం.. ఈరాశులకు పట్టనున్న అదృష్టం..

Shani Gochar 2023: వచ్చే వారంలో శనిదేవుడు కుంభరాశిలో ఉదయించబోతున్నాడు. ఈ పరిణామం కారణంగా కొందరి జాతకం మారిపోనుంది. ఇందులో మీరున్నారేమో చెక్ చేసుకోండి.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 1, 2023, 06:54 PM IST
Shani Dev uday 2023: వచ్చే వారంలో కీలక పరిణామం.. ఈరాశులకు పట్టనున్న అదృష్టం..

Shani Dev uday 2023: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని క్రూరగ్రహం, కర్మదాత మరియ న్యాయదేవుడు ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. అన్ని గ్రహాల్లోకెల్లా నెమ్మదిగా కదిలే ఫ్లానెట్ శని. ఇది సాధారణంగా రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మారుస్తుంది. ఎవరి జాతకంలో శనిదేవుడు శుభస్థానంలో ఉంటాడో వారికి దేనికీ లోటు ఉండదు. ఏరాశివారికి కుండలిలో శని అశుభస్థానంలో ఉంటాడో వారు జీవితం సమస్యలతో నిండి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ శనిదేవుడి అనుగ్రహం ఉండాలని కోరుకుంటారు.

ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో అస్తమించాడు. మళ్లీ అదే రాశిలో మార్చి 06, 2023 రాత్రి 11.36 గంటలకు ఉదయించనున్నాడు. శనిదేవుడు రైజింగ్ కొన్ని రాశులవారి జాతకాన్ని మార్చనుంది. వీరికి ఇకపై దేనికీ లోటు ఉండదు. ఆ అదృష్ట రాశులేంటో ఓ లుక్కేద్దాం. 

మేషరాశి
మేషరాశికి అధిపతి కుజుడు. కుంభరాశిలో శనిదేవుడు ఉదయించడం వల్ల మీకు మంచి రోజులు మెుదలవుతాయి. గత కొన్ని రోజులుగా ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. కెరీర్ దూసుకుపోతుంది. బిజినెస్ లో భారీగా లాభాలు ఉంటాయి. అన్ని సమస్యల నుంచి మీకు విముక్తి లభిస్తుంది. సంతానప్రాప్తి కలుగుతుంది. 
వృషభం
కుంభరాశిలో శని ఉదయించడం వల్ల వృషభరాశివారికి వరమనే చెప్పాలి. వీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
మకరరాశి
కుంభరాశిలో శని ఉదయించడం మకరరాశి వారికి శుభసూచకం. కెరీర్ పరంగా బాగుంటుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్ వస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. 

Also Read: Guru Uday 2023: 'హన్స్ రాజయోగం' చేస్తున్న గురుడు... ఈరాశులకు మంచి రోజులు మెుదలు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. 

Trending News