Shani- Shukra Gochar: కుంభరాశిలో మిత్ర గ్రహాల కలయిక.. ఈ 3 రాశులకు తిరుగులేదు ఇక..

Shani And Shukra Gochar 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కుంభరాశిలో శని మరియు శుక్రుడు కలయిక ఏర్పడింది. దీని కారణంగా 3 రాశుల వారికి మంచి రోజులు మొదలవుతాయి. 

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 25, 2023, 05:03 PM IST
Shani- Shukra Gochar: కుంభరాశిలో మిత్ర గ్రహాల కలయిక.. ఈ 3 రాశులకు తిరుగులేదు ఇక..

Conjunction Of Saturn And Venus: వైదిక జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శని గ్రహం జనవరి 17న కుంభరాశిలో సంచరించింది. ఐదు రోజుల తర్వాత అంటే జనవరి 22న శుక్రుడు అదే రాశిలోకి ప్రవేశించాడు. దీని కారణంగా కుంభరాశిలో శుక్ర, శని కలయిక ఏర్పడింది. పైగా ఈ రెండు గ్రహాలు మిత్రులు. జ్యోతిషశాస్త్రంలో ఈ రెండు గ్రహాల కలయిక శుభప్రదంగా భావిస్తారు. వీటి సంయోగం వల్ల ఏ రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం. 

మకరం (Sagittarius)
శుక్ర మరియు శని కలయిక మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి రెండవ ఇంట్లో ఈ కూటమి ఏర్పడుతోంది. దీంతో మీ ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. వివిధ మార్గాల ద్వారా మీరు డబ్బు సంపాదిస్తారు. ల్యాండ్ పై మీరు పెట్టుబడి పెట్టడం వల్ల లాభాలను పొందుతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఈ రాశివారిపై జనవరి 17 నుంచి శని సడే సతి చివరి దశ మొదలైంది.

సింహ రాశి (Leo)
శుక్ర మరియు శని కలయిక సింహ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో ఏడవ ఇంట్లో ఈ కూటమి ఏర్పడుతోంది. అందుకే ఈ సమయంలో వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. పార్టనర్ షిపి తో చేసే పనుల్లో మీరు ప్రయోజనం పొందుతారు. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు ఈ సమయంలో మణిని ధరించడం వల్ల ప్రయోజనం పొందుతారు. 

ధనుస్సు రాశిచక్రం (Sagittarius)
శుక్ర మరియు శని కలయిక మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి మూడవ ఇంట్లో ఈ కూటమి ఏర్పడుతోంది. దీని  కారణంగా మీలో ధైర్యం పెరుగుతుంది. తోబుట్టువుల సపోర్టు లభిస్తుంది. విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. జనవరి 17న శని సడే సతి నుండి విముక్తి లభిస్తుంది. మీరు కెరీర్ లో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. 

Also Read: Ketu Transit 2023: త్వరలో కేతు సంచారం.. ఈ రాశులపై డబ్బు వర్షం.. ఇందులో మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News