Sankranti 2024: సంక్రాంతి రోజు ఈ రాశుల వారిపై సూర్య భగవానుడు కనక వర్షం కురిపించబోతున్నాడు..

Sankranti 2024: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన సూర్యుడు ఈరోజు మకర రాశిలోకి ప్రవేశించాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉండడమే కాకుండా పనుల్లో ఆటంకాలన్నీ పరిష్కారం కాబోతున్నాయి. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 15, 2024, 05:40 AM IST
Sankranti 2024: సంక్రాంతి రోజు ఈ రాశుల వారిపై సూర్య భగవానుడు కనక వర్షం కురిపించబోతున్నాడు..

 

Sankranti 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు రాజుగా వ్యవహరించే సూర్యగ్రహం జనవరి 15వ తేదీన తెల్లవారి జామున 2:43 నిమిషాలకు రాశి సంచారం చేయబోతోంది. సూర్య గ్రహం ఫిబ్రవరి 13 వరకు అదే రాశిలో సంచార దశలో ఉంటుంది. సనాతన ధర్మం ప్రకారం ఈ గ్రహం మకర రాశిలోకి సంచారం చేయడం పండగల భావిస్తారు. అందుకే ఈరోజు మకర సంక్రాంతి పండగను జరుపుకుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంక్రాంతి పండగకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈరోజు నదీ స్నానం ఆచరించి సూర్య భగవానుడిని పూజించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతేకాకుండా ధాన్యాలను దానం చేయడం వల్ల శ్రేయస్సు కూడా లభిస్తుంది.

అంతేకాకుండా ఈరోజు జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన రవియోగం కూడా ఏర్పడింది. అయితే ఈ రవి యోగం 77 సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం మకర రాశికి మరింత ప్రాముఖ్యత పెరిగిందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా సూర్య గ్రహ సంచారం ఈ ప్రత్యేక యోగాల కారణంగా కొన్ని రాశుల వారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ గ్రహ సంచారం కారణంగా ఏయే రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయే ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సూర్య గ్రహ సంచారంతో ఈ రాశుల వారికి లాభాలే లాభాలు:
మేషరాశి:

సూర్య గ్రహ సంచారం మేష రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు నుంచి మేషరాశి వారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో వీరు ఆస్తులను కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దీని కారణంగా సంపాదన రెట్టింపు అవుతుంది. ఇక వృత్తి జీవితం గడుపుతున్న వారికి ఈ సమయం చాలా కలిసి వస్తుంది. ఉద్యోగాలు చేసే వారికి బాస్ మద్దతు లభించి.. ప్రమోషన్స్ కూడా పొందుతారు. అంతేకాకుండా కార్యాలయాల్లో ప్రశంసలు కూడా పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఉద్యోగరీత్యా ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సూర్య గ్రహ సంచారం కారణంగా న్యాయపరమైన చిక్కులు కూడా ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. కెరీర్ పరంగా అనేక విజయాలు విజయాలు సాధించడమే కాకుండా..ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్స్ కూడా పొందుతారు.

Also read: Bhogi Pallu 2024: భోగి పండగ రోజే పిల్లలకు భోగి పండ్లను ఎందుకు పోస్తారు? ఇది తెలిస్తే తప్పకుండా మీ పిల్లలకు కూడా పోస్తారు..

కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఈ సమయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ముఖ్యంగా కుటుంబంలో కలహాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక వైవాహిక జీవితం గడుపుతున్న వారికి ఈ సమయంలో సమస్యలు పరిష్కారం అవుతాయి. దీంతోపాటు గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్న పనులన్నీ సులభంగా పరిష్కారమవుతాయి.

సింహరాశి:
సింహరాశి వారికి ఈ సమయం చాలా శుభ్రంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకు ఎంతో లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో పోటీ పరీక్షలు రాయడం వల్ల మంచి ర్యాంకులు పొందుతారు. ఆర్థిక పరిస్థితులు కూడా ఈ సమయంలో మెరుగుపడతాయి. పనుల్లో అడ్డంకులన్నీ తొలగిపోయి.. ఇప్పుడిప్పుడే లాభాలు రావడం ప్రారంభమవుతాయి.

కన్యారాశి:
కన్యా రాశి వారు సూర్యగ్రహ సంచారం కారణంగా పిల్లల నుంచి అనేక శుభవార్తలు వింటారు. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మద్దతు లభించి ఎలాంటి పనులైన సులభంగా చేయగలుగుతారు. ముఖ్యంగా ఈ సమయంలో విద్యార్థులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పనుల్లోని ఇంతకుముందు ఉన్న అడ్డంకులన్నీ సులభంగా తొలగిపోతాయి.

Also read: Bhogi Pallu 2024: భోగి పండగ రోజే పిల్లలకు భోగి పండ్లను ఎందుకు పోస్తారు? ఇది తెలిస్తే తప్పకుండా మీ పిల్లలకు కూడా పోస్తారు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News