Mangal Vakri 2022: అరుదైన రాజయోగం.. ఈ 4 రాశులవారు ధనవంతులవ్వడం ఖాయం..

Mangal Vakri 2022: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. ఈ సమయంలో కుజుడు తిరోగమనం వల్ల  ఒక అరుదైన రాజయోగం ఏర్పడుతుంది. ఇది నాలుగు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 8, 2022, 04:44 PM IST
Mangal Vakri 2022: అరుదైన రాజయోగం.. ఈ 4 రాశులవారు ధనవంతులవ్వడం ఖాయం..

Mangal Vakri 2022:  ప్రస్తుతం మిథునరాశిలో కుజుడు తిరోగమనంలో ఉన్నాడు. గ్రహాల అధిపతి అయిన అంగారకుడి తిరోగమనం కారణంగా రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం అన్ని రాశులవారిని ప్రభావితం చేస్తుంది. అయితే ఈ యోగం  నాలుగు రాశులవారికి శుభఫలితాలను ఇవ్వనుంది. తిరోగమన కుజుడు కారణంగా ఏర్పడిన విపరీత రాజయోగం (vipreet rajyoga) 4 రాశులవారికి మేలు చేస్తుంది. ఇది కెరీర్ లో పురోగతిని, వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది. 

వృషభం (Taurus): అంగారకుడి తిరోగమనం కెరీర్‌లో మీకు పెద్ద లాభాలను ఇస్తుంది. కెరీర్‌లో సానుకూల మార్పు ఉంటుంది. కొత్త ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. వివిధ వనరుల డబ్బు సమకూరుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. 

కన్య (Virgo): కన్యారాశి వారికి కుజుడు తిరోగమనం ఉద్యోగ-వ్యాపారాలలో విజయాన్నిస్తుంది. కొత్త జాబ్ ఆఫర్ రావచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది. శ్రమకు తగ్గ  ఫలితం లభిస్తుంది.  పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. 

సింహం (Leo): తిరోగమన అంగారకుడు సింహ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తక్కువగా ఉంటాయి. మీరు పొదుపు మరియు పెట్టుబడిలో విజయం సాధిస్తారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారి అన్వేషణ ముగుస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

కుంభం (Aquarius): కుజుడు తిరోగమనం కారణంగా కుంభ రాశి వారికి శక్తి, ఉత్సాహం పెరుగుతాయి. ఉద్యోగ-వ్యాపారాలలో లాభం ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. మీరు కష్టాల నుండి ఉపశమనం పొందుతారు.

Also Read: Chandra Grahan 2022: చంద్రగ్రహణం శనిదేవుడి యెుక్క ఇష్టమైన రాశులకు భారీ మెుత్తంలో డబ్బును ఇవ్వనుంది..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News