Ramlala Suryabhishek: అయోధ్యలో అపురూప ఘట్టం.. 17న రామయ్యకు సూర్యతిలకం..

Ramlala Suryabhishek:బాలరాముడు కొలువైన అయోధ్యలో మరో అపురూప ఘట్టం నెలకొననుంది. ఈనెల 17న శ్రీరామ నవమి సందర్భంగా బాలరాముని నుదిటిపై సూర్యకిరణాలు ప్రసరించనున్నాయి.

Written by - Renuka Godugu | Last Updated : Apr 13, 2024, 08:15 AM IST
Ramlala Suryabhishek: అయోధ్యలో అపురూప ఘట్టం.. 17న రామయ్యకు సూర్యతిలకం..

Ramlala Suryabhishek:బాలరాముడు కొలువైన అయోధ్యలో మరో అపురూప ఘట్టం నెలకొననుంది. ఈనెల 17న శ్రీరామ నవమి సందర్భంగా బాలరాముని నుదిటిపై సూర్యకిరణాలు ప్రసరించనున్నాయి. ఈ అద్భుత ఘట్టం రామ భక్తులకు కనువిందు కానుంది. సుమారు 6 నిమిషాలపాటు నవమిరోజు సూర్యకిరణాలు రాముని నుదుటి తిలకంగా ప్రసరించనున్నాయి.ముఖ్యంగా ఈ సుందరఘట్టం అభిజిత్ ముహూర్తంలో జరగనుంది. ఈ సూర్యతిలకానికి ఎందుకంత ప్రాధాన్యత తెలుసుకుందాం.

ఇదీ చదవండి: దుర్గాష్టమి రోజున రెండు శుభయోగాలు.. ధనవంతులు కాబోతున్న 3 రాశులు ఇవే..!

ఈనెల ఏప్రిల్ 17 దేశవ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుకొంటారు. అయోధ్యలో ఇది మొదటిసారి దీంతో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు భక్తుల తాకిడీ కూడా పెరగనుంది. శ్రీరామ నవమి రోజు 56 నైవేద్యాలు పెడతారు. అంతేకాదు సూర్యతిలకం కూడా ధరించనున్నారు. ఈ సుందర ఘట్టం అభిజిత్‌ ముహూర్తం అంటే 12 గంటల సమయంలో బాలరాముని నుదిటిపై సూర్యకిరణాలు పడనున్నాయి.

ఇదీ చదవండి:ఇంట్లో పూజగది చెక్కతో చేసింది పెట్టుకోవడం అశుభమా?

మన సనాతన ధర్మంలో సూర్యుడు శక్తికి మూలం. కాబట్టి సూర్యకిరణాలతో అభిషేకం చేస్తే దైవత్వ భావన మేల్కొంటుంది. ఈ అపురూప ఘట్టం ఈ సమయంలోనే ఎందుకు నిర్వహించనున్నారంటే రాముడు చైత్రమాసం శుక్లపక్షం 9వరోజు మధ్యాహ్నం 12 గంటలకు జన్మించారని నమ్ముతారు. సూర్యుడు ఆ సమయంలో పూర్తి ప్రభావంతో ఉంటాడు. ఇలా చేయడం వల్ల సూర్య స్థానం కూడా జాతకంలో బలపడుతుంది. మన పురాణాల ప్రకారం సూర్యుడుని పూజిస్తే తేజస్సు, ఆరోగ్యం లభిస్తుంది. 
 
ఈ సూర్య అభిషేకం ఘట్టం నిర్వహించడానికి అయోధ్య బాలరాముని ఆలయ యంత్రాంగం అన్ని పనులను పూర్తి చేస్తోంది. ఈ అపురూప ఘట్టానికి ఆలయంలోని కింది ఫ్లోర్లో అద్దాలను, లెన్స్‌ ఏర్పాటు చేస్తున్నారు.  రెండో ఫ్లోర్‌లో అమర్చిన మూడు లెన్స్‌లు రెండు అద్దాల గుండా సూర్యుడి కిరణాలు నేరుగా గ్రౌండ్‌ ఫ్లోర్లో ఉన్న అద్దంపై పడి దీని పరావర్తనం కారణంగా అయోధ్య రాముడి నుదుట తిలకాన్ని ఏర్పరుస్తాయి. ఈ అద్బుతమైన ఘట్టాన్ని ఆప్టోమెకానికల్ సిస్టం ద్వారా బాలరాముని నుదుటిపై సూర్య కిరణాలు పడేలా చేయనున్నారు. దీంతో నేరుగా బాలరాముని నుదుటికి సూర్యతిలకం  ఘట్టం జరగనుంది(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News