TTD Online Tickets: తిరుమలకు స్వామి వారి ఆర్జీత సేవా కార్యక్రమాలలో పాల్లొనాలనుకునే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్జీత సేవా టిక్కెట్లను ఈరోజు విడుదల చేసింది.
కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో వస్తుంటారు. ప్రతిరోజు కూడా దర్శనానికి ఎనిమిది గంటల నుంచి పన్నేండు గంటల వరకు కూడా సమయం పడుతుంది. అనేక కంపార్ట్ మెంట్ లో భక్తులు ఆ స్వామివారిని దర్శించుకొవడం కోసం వేచీ చూస్తుంటారు.
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. భక్తుల కోసం ఆగస్ట్ నెలకు సంబంధించి దర్శనం, ఆర్జితసేవా టికెట్లు, శ్రీవారి సేవ కోటా టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసింది. ఈ నేపథ్యంలో భక్తులు.. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహోత్సవం, సహస్రదీపాలంకార సేవ, వార్షిక పవిత్రోత్సవాలు సేవా టికెట్లను పొందే అవకాశం ఉంటుంది.
మే 21వ తేదీ ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఇక ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం మే 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు భక్తులు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన భక్తులు.. మే 20 నుంచి మే 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు సరిపడ డబ్బులు చెల్లిస్తే లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయని టీటీడీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆగస్ట్ 15 నుంచి 17వ తేదీ వరకూ వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ టికెట్లను కూడా భక్తులకు ఆన్ లైన్లో అందుబాటులో ఉంచనున్నారు. ఇక వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి సంబంధించి.. ఆగస్ట్ నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను మే 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నట్లు సమాచారం.
మరుసటి రోజు అంటే మే 24వ తేదీ ఉదయం పది గంటలకు ఆగస్టు నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనంకు సంబంధించి రూ. ౩౦౦ టికెట్ల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా.. తిరుమల, తిరుపతిలో ఆగస్ట్ నెల గదుల కోటాను మే 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు.
ఇదిలా ఉండగా భక్తులు.. టీటీడీ వెబ్ సైట్ ను సందర్శించి https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవాలని టీటీడీ ఓ ప్రకటనలో కోరింది. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని టీటీడీ ఒకప్రకటనలో వెల్లడించింది.