Rahu Ketu Transit 2023 To 2024: జ్యోతిష్య శాస్త్రంలో అంతు చిక్కని గ్రహాలుగా పేర్కొనే..రాహు, కేతు సంచారం అక్టోబర్ 30వ జరిగింది. ప్రస్తుతం రాహు మీనరాశిలో ఉండగా..కేతువ గ్రహం కన్యా రాశిలో ఉంది. అయితే ఈ గ్రహాలు 2025వ సంవత్సరం వరకు ఎలాంటి రాశి సంచారాలు చేయువు. కానీ 2024 సంవత్సరంలో ఈ రెండు గ్రహాల కదలికల్లో మార్పులు రాబోతున్నాయి. దీని కారణంగా రాబోయే కొత్త సంవత్సరం కొన్ని రాశుల వారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. రాహు కేతు గ్రహాల కదలికల్లో మార్పుల కారణంగా 2024 సంవత్సరంలో ఏయే రాశుల వారు సమస్యలను ఎదుర్కొంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మకర రాశి:
మకర రాశి వారికి ఈ సమయంలో వృత్తిపరంగా అనేక సవాళ్లు ఎదురవుతాయి అంతే కాకుండా పిల్లలనుంచి కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు అనుకున్న కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభించకపోవచ్చు. అంతేకాకుండా కోపం కారణంగా చిన్న చిన్న సమస్యల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. వైవాహిక జీవితంలో కూడా అనేక సమస్యలు వస్తాయి.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి కూడా మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా పనిపై ఏకాగ్రత తగ్గిపోతుంది. కుటుంబంతో విభేదాలు కూడా రావచ్చు ఎలాంటి పనులు చేసిన తీవ్ర ఆటంకాలు ఎదురవుతాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాలి ఏవైనా నిర్ణయాలు తీసుకునే క్రమంలో తప్పకుండా పదిసార్లు ఆలోచించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో తొందరపడకపోవడం చాలా మంచిది. ఈ సమయంలో పని పెరగడం కారణంగా ఒత్తిడి సమస్యలు కూడా రావచ్చు.
మీన రాశి:
మీన రాశి వారికి రాబోయే 2024 సంవత్సరం కొంత నిరాశ కలిగించవచ్చు. ఉద్యోగాలు చేస్తున్న వారికి కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. పని పెరగడం కారణంగా ఒత్తిడి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేకపోతే అనేక అనారోగ్య సమస్యలు రావచ్చు. డబ్బు విషయంలో ఇంట్లో గొడవలు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి గొడవలకు దూరంగా ఉండడం చాలా మంచిది ముఖ్యంగా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే వారికి ఈ సంవత్సరం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి