Rahu Ketu Gochar 2023: వచ్చే 6 నెలలు ఈ రాశుల జీవితం అల్లకల్లోలం.. ఇందులో మీరున్నారా?

Rahu-Ketu Gochar 2023: దుష్ట గ్రహాలైన రాహు కేతువుల స్థానంలో చిన్న మార్పు కూడా ప్రజల జీవితాలపై పెద్ద ప్రభావాన్నే చూపుతుంది. రాహు-కేతు సంచారం వల్ల కొన్ని రాశులవారు నష్టపోనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 18, 2023, 11:33 AM IST
Rahu Ketu Gochar 2023: వచ్చే 6 నెలలు ఈ రాశుల జీవితం అల్లకల్లోలం.. ఇందులో మీరున్నారా?

Rahu and Ketu Transit 2023: ఆస్ట్రాలజీలో రాహు-కేతువులను అశుభ లేదా దుష్ట గ్రహాలుగా భావిస్తారు. ఈ రెండు గ్రహాల చెడు దృష్టి ఎవరిపై పడుతుందో వారి జీవితం నాశనమవ్వడానికి ఎంతో సమయం పట్టదు. రాహు, కేతువులు తమ రాశులను మార్చినప్పుడల్లా అవి ప్రజల జీవితాల్లో అల్లకల్లోలం సృష్టిస్తాయి. ప్రస్తుతం ఈ రెండు గ్రహాలు మేషరాశిలో సంచరిస్తున్నాయి. అక్టోబరు 30 వరకు అదే రాశిలో ఉంటాయి. రాహు-కేతు సంచారం వల్ల మూడు రాశుల జీవితం గందరగోళానికి గురికానుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 

మేషం
రాహు-కేతువుల రాశి మార్పు మేషరాశి వారికి అస్సలు కలిసిరాదు. మీరు డబ్బు సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. వ్యాపారులు నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. మీ కుటుంబంలో ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. 

Also read: Jupiter Mahadasha: మీ జాతకంలో గురు మహాదశ ఉందా? అయితే మీరు 19 ఏళ్లు కింగ్ లా బతుకుతారు..

వృషభం
రాహు-కేతువుల సంచారం వల్ల వృషభరాశి వారు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కోంటారు. ఫ్యామిలీలో గొడవలు తలెత్తుతాయి. అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. భార్యభర్తల మధ్య వివాదాలు వచ్చే అవకాశం ఉంది. మెుత్తానికి ఈ సమయం మీకు అస్సలు బాగోదు.
కన్య
కేతు గ్రహం అక్టోబర్ 30న ఇదే రాశిలోకి ప్రవేశించనుంది. దీంతో ఉద్యోగ, వ్యాపారులు చాలా సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. కుటుంబ సంబంధాలు చెడిపోతాయి. అప్పులు వాళ్లు ఇంటి మీద పడతారు. అనుకున్న పనులు సమయానికి జరగవు. 

Also read: Chaturgrahi Yog: మరో నాలుగు రోజుల్లో 'చతుర్గ్రాహి యోగం'.. ఈ రాశుల ఫేట్ మారడం ఖాయం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News