Pradosha Vratam 2024: ప్రదోషవ్రతం.. ఈ ఒక్కవస్తువు ఇంటికి తెచ్చుకుంటే మిమ్మల్ని పీడిస్తున్న గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి..

Pradosha Vratam 2024: ప్రదోషవ్రతం రోజు శివపూజ చేస్తారు. ముఖ్యంగా ఈరోజు శివుడికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే,  ప్రదోష వ్రతం ప్రతి మాసంలోని త్రయోదశి తేదీన ఆచరిస్తారు. ప్రదోషవ్రతం, సోమవారం ఈ రోజుల్లో కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తే శివుని ప్రత్యేక అనుగ్రహాన్ని పొందవచ్చు. 

Written by - Renuka Godugu | Last Updated : Feb 7, 2024, 08:18 AM IST
Pradosha Vratam 2024: ప్రదోషవ్రతం.. ఈ ఒక్కవస్తువు ఇంటికి తెచ్చుకుంటే  మిమ్మల్ని పీడిస్తున్న గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి..

Pradosha Vratam 2024: ప్రదోషవ్రతం రోజు శివపూజ చేస్తారు. ముఖ్యంగా ఈరోజు శివుడికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే,  ప్రదోష వ్రతం ప్రతి మాసంలోని త్రయోదశి తేదీన ఆచరిస్తారు. ప్రదోషవ్రతం, సోమవారం ఈ రోజుల్లో కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తే శివుని ప్రత్యేక అనుగ్రహాన్ని పొందవచ్చు. 

జోతిష్య శాస్త్రం ప్రకారం వారంలోని ఏడు రోజులు ఒక దేవుడికి అంకితం చేశారు. ప్రతి నెల త్రయోదశి తిథి ,వారంలో మొదటి రోజు శివునికి అంకితం చేశారు. ఈ రోజున ఆచారాల ప్రకారం పూజలు చేయడం, ఉపవాసం మొదలైనవి చేయడం వల్ల మహాదేవుడు ప్రసన్నుడై భక్తుల కోరికలను తీరుస్తాడు. ఈరోజున కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీనివల్ల మిమ్మల్ని పీడిస్తున్న గ్రహదోషాలన్ని వదిలిపోతాయి. 

ఇదీ చదవండి: Ruchaka Rajyog 2024: రుచకరాజ్యయోగం ఈరాశికి ప్రత్యేకం.. మార్చిలోగా కొత్త ఉద్యోగం, కాసులవర్షం..

ఈ రోజున పాలను భోలేనాథ్‌కి సమర్పించడం  వల్ల జీవితంలో సంతోషం ,శ్రేయస్సును కలిగించే అతని ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి.హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘమాసంలోని కృష్ణ పక్షం త్రయోదశి తేదీ ఫిబ్రవరి 7న అంటే ఈరోజు వస్తుంది. ఈ రోజున కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. కాబట్టి పొరపాటున కూడా కొన్ని వస్తువులను కొనకండి. ఈ విషయాల గురించి తెలుసుకుందాం. 

ప్రదోష వ్రతం రోజు ఇవి కొనుగోలు చేయండి..

ఇనుము..
ప్రదోషవ్రతం రోజు ఇనుము వస్తువులను కొనుగోలు చేయడం కూడా శ్రేయస్కరం. ఈ రోజు ఇనుప పాత్రలు ఇతర వస్తువులను కొనుగోలు చేస్తే శివుని ఆశీర్వాదాన్ని తెస్తుంది, ఇంట్లో శ్రేయస్సు వస్తుంది.

సోమవారం లేదా ప్రదోష వ్రతం రోజున చంద్రుని ,శివుని అనుగ్రహం పొందడానికి తెల్లటి వస్తువులను కొనుగోలు చేయాలి. అన్నం, పాలు, తెల్లని బట్టలు మొదలైనవి. చంద్రుడు మనస్సుకు కారకునిగా భావిస్తారు.ఈ వస్తువులను కొనుగోలు చేయడం, తెల్లని బట్టలు ధరించడం వల్ల మనస్సుకు శాంతి, జీవితంలో ఆనందం కలుగుతాయి.

అక్వేరియం..
ప్రదోష వ్రతం రోజున అక్వేరియం కొనడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అక్వేరియం కొని అందులో చేపలను ఉంచడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి. చంద్రదోషం ఉన్నవారు ఈ రోజున తెల్లని వస్త్రాలు ధరించి చంద్ర భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. 

ఇదీ చదవండి: Rama- Krishna Tulsi: కృష్ణతులసి, రామతులసికి తేడా ఏమిటి? ఇంట్లో ఏ తులసిని నాటాలో తెలుసా?

ప్రదోష వ్రతం,సోమవారం ఈ వస్తువులను కొనకండి..

నేడు, రంగులు, పెయింటింగ్ బ్రష్‌లు, సంగీత వాయిద్యాలు మొదలైన కళకు సంబంధించిన వస్తువులు కొనకూడదు. ఇది కాకుండా ఈ రోజున క్రీడలకు సంబంధించిన వస్తువులు, కార్లు మొదలైనవి కొనుగోలు చేయకూడదు. ఇది శుభప్రదంగా పరిగణించబడదు. దీనివల్ల ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని అంటున్నారు. అంతేకాదు, బియ్యం మినహా, గోధుమలు, పప్పులు మొదలైన ఇతర ధాన్యాలు కొనుగోలు చేయకూడదు. (Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News