Jupiter Transit 2024: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాలు, నక్షత్రరాశులు నిరంతరం రాశిచక్రమంలో కదులుతూ ఉంటాయి. ప్రతి గ్రహం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తాయి. ఈ కదలికను గ్రహ గమనం అంటారు. ఈ గ్రహ గమనం మన జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అయితే ప్రస్తుతం నవగ్రహాల్లో దేవగురువైన బృహాస్పతి వృషభ రాశిలో ఉంటూ నక్షత్ర సంచారం చేస్తున్నాడు. ఈ నక్షత్ర ప్రవేశం అనేది 12 సంవత్సరాల తర్వాత జరుగుతోంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వృషభ రాశికి అధిపతి శుక్రుడు. రోహిణి నక్షత్రం కూడా శుక్రుడికి సంబంధించినదే. బృహస్పతిని గురువు అని కూడా అంటారు. అయితే ఈ గ్రహం రోహిణి నక్షత్రంలోకి సంచారం చేయబోతోంది. ఈ సంచారం కారణంగా ఆగస్ట్ వరకు మూడు రాశుల వారికి ఎంతో అమూల్యమైన సమయం ఏర్పడుతుంది. ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
వృషభ రాశి:
బృహస్పతిని ధనకారకుడిగా భావిస్తారు. వృషభ రాశిలో సంచరించడం వల్ల ఆర్థికంగా మంచి ఫలితాలు లభించే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడవచ్చు లేదా ఉన్న వ్యాపారం విస్తరించవచ్చు. ఉద్యోగస్తులకు ప్రమోషన్, బదిలీ లేదా వేతన పెరుగుదల వంటి అవకాతాలు ఉండవచ్చు. పని స్థలంలో గౌరవం పెరగవచ్చు. భూమి, ఇల్లు లేదా ఇతర ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి ఇది అనుకూల సమయం. పెట్టుబడులు మంచి లాభాలను ఇచ్చే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరగవచ్చు. చేసే పనులకు మంచి గుర్తింపు లభించవచ్చు.
సింహ రాశి:
సింహ రాశిలో బృహస్పతి సంచారం ఆర్థికంగా ఈ రాశివారు గణనీయమైన ప్రగతిని సాధించే అవకాశం ఉంది. కొత్త ఒప్పందాలు, భారీ లాభాలు కలుగుతాయి. వ్యాపారం కొత్త ఎత్తులకు ఎదగడానికి ఇది మంచి సమయం. పదోన్నతులు, శుభవార్తలు వింటారు. విద్యార్థల కెరీర్‌లో గణనీయమైన అభివృద్ధి ఉంటుంది. బృహస్పతి ప్రభావం వ ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. లక్ష్మీదేవి, కుబేరుడు వంటి దేవతలను పూజించడం వల్ల ఆర్థిక పురోగతి వేగంగా ఉంటుంది. లభించిన ఆదాయంలో కొంత భాగాన్ని పేదలకు దానం చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది. గురువును పూజించడం వల్ల అన్ని విధాలా అభివృద్ధి ఉంటుంది.
ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారు ఈ కాలంలో చాలా అదృష్టవంతులు. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. ఆస్తి లేదా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా లాభాలు పొందుతారు. ఈ సమయంలో ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తే అది పూర్తి లాభాలు తీసుకొస్తుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు లేదా కొత్త ఉద్యోగంలో చేరవచ్చు. విద్యార్థులకు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. వైవాహిక జీవితం సుఖసంతోషాలతో నిండి ఉంటుంది. గురు గ్రహానికి పూజలు, ధానాలు చేయడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయని జ్యోతిషశాస్త్రనిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఎల్లప్పుడూ 100% ఖచ్చితమైనది కాదు. ఇచ్చిన సమాచారం ఒక వ్యక్తికి ఉపయోగకరంగా ఉండవచ్చు కానీ మరొకరికి కాకపోవచ్చు. మీకు ఏదైనా సందేహం ఉంటే జ్యోతిషశాస్త్రనిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి