Planet Tranisit July 2022: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జూలై నెలలో 4 పెద్ద గ్రహాలు రాశిచక్రం మారబోతున్నాయి. సూర్యుడు, బుధుడు, శుక్రుడు, శని గ్రహాలు ప్రస్తుతం ఉన్న రాశిని వదిలి మరో రాశిలోకి ప్రవేశించనున్నాయి. దీని ప్రభావం రాశిచక్రంలోని 12 రాశులపై ఉంటుంది, దీని కారణంగా ప్రతి వ్యక్తి జీవితంలో మార్పులు కనిపిస్తాయి. ఈ మార్పు కొందరికి సానుకూలంగా ఉండొచ్చు. కొందరికి కొత్త సవాళ్లను తీసుకురావొచ్చు. జ్యోతిష్య నిపుణుల ప్రకారం జూలైలో ఏయే గ్రహాలు రాశులు మారబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం...
జూలైలో రాశి మారనున్న గ్రహాలు :
బుధ గ్రహం రాశి మార్పు : బుధ గ్రహం జూలై 2న రాశి మారనుంది. వృషభరాశి నుంచి మిథునరాశిలోకి ప్రవేశించనుంది. ఆ తర్వాత జూలై 16 నుంచి కర్కాటక రాశిలో సంచరించడం ప్రారంభమవుతుంది.
కర్కాటక సంక్రాంతి : జూలై 17న సూర్యుడు రాశి మారుతాడు. సూర్య భగవానుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలో సంచరిస్తాడు. దీన్నే కర్కాటక సంక్రాంతి అని కూడా అంటారు.
శని తిరోగమనం : జూలై 12న శని మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడు. మకరరాశిలో శని తిరోగమన దిశలో కదులుతాడు.
శుక్ర రాశి మార్పు : సంతోషానికి, తేజస్సుకు కారకుడైన శుక్రుడు జూలై 13న వృషభరాశి నుంచి మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇది చాలా మంది జీవితాల్లో ఆనందం, శ్రేయస్సును తీసుకొస్తుంది.
బృహస్పతి రాశి మార్పు : గ్రహం మీనరాశిలోకి ప్రవేశించనుంది. జూలై 29, రాత్రి 2.06 గం. నుంచి బృహస్పతి మీనంలో తిరోగమనంలో ఉంటుంది. అలాగే మేషరాశిలో రాహువు, తులారాశిలో కేతువు, మేషరాశిలో కుజుడు ఇదే నెలలో ప్రవేశించనున్నారు. వీటి ప్రభావం కొన్ని రాశుల వారికి కలిసొస్తే.. మరికొన్ని రాశుల వారికి ప్రతికూలతలు తీసుకొస్తుంది.
Also Read: TS DOST 2022: నేడే దోస్త్ నోటిఫికేషన్.. విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోండిలా...
Also Read: Sapota Benefits: సపోటా పండ్లను వీరు అస్సలు తినకూడదు.. తింటే ఈ దుష్ప్రభావాలు తప్పవు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి