Money Lines on Palm: అరచేతిలో ఈ గీతలుంటే.. డబ్బే డబ్బు.. పట్టిందల్లా బంగారమేనట

Money Lines on Palm : విధి రేఖ కంకణం నుంచి నేరుగా శని పర్వతాన్ని చేరితే.. ఆ వ్యక్తులు వ్యాపార రంగంలో బాగా రాణిస్తారు. సంపదను కూడబెడుతారు. పైగా ఆ వ్యక్తులు ప్రసంగ నైపుణ్యంలో ప్రావీణ్యం కలిగి ఉంటారు. వాక్చుతుర్యం ద్వారా వారికి పేరు ప్రతిష్ఠలు, డబ్బు కలుగుతాయి.

Last Updated : Jan 19, 2022, 03:38 PM IST
  • హస్తసాముద్రికంతో వ్యక్తుల అదృష్ట, దురదృష్టాలను తెలుసుకోవచ్చు
  • ధన రేఖతో పాటు ప్రత్యేక గుర్తులు ఉన్నవారు ధనవంతులు అవుతారు
  • అరచేతిలోని ధన రేఖ సూర్య పర్వతాన్ని తాకితే అదృష్టవంతులు
Money Lines on Palm: అరచేతిలో ఈ గీతలుంటే.. డబ్బే డబ్బు.. పట్టిందల్లా బంగారమేనట

Money Lines on Palm : హస్తసాముద్రికం ప్రకారం.. అరచేతిలోని ప్రతీ గీతకు ఒక నిగూఢ అర్థం, సంకేతం ఉంటుంది. ఆ వ్యక్తి భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలను ఆ రేఖలను బట్టి అంచనా వేయవచ్చునని హస్తసాముద్రిక నిపుణులు చెబుతుంటారు. రేఖలు మాత్రమే కాదు అరచేతి వేళ్ల కింద ఉండే ఉబ్బెత్తులు కూడా ఆ వ్యక్తి భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలను తెలియజేస్తాయి. పర్వతాలుగా పరిగణించే వీటిని గ్రహాలతో పోలుస్తారు. ఇవేగాక అరచేతిలో కొన్ని ప్రత్యేక గుర్తులు ఉంటాయి. ఆ గుర్తులు ఉన్నవారు ధనవంతులుగా (Rich People) ఉండటంతో పాటు జీవితంలోని అన్ని ఆనందాలను అనుభవిస్తారు.

హస్తసాముద్రిక శాస్త్రం (Palmistry) ప్రకారం, బుధుడు లేదా శని గ్రహానికి సంబంధించి తరాజు గుర్తు శుభప్రదం. అరచేతిలో ఈ గుర్తు ఉన్నవారు వ్యాపారంలో చాలా పురోగతిని సాధిస్తారు. అలాంటివారికి సంపదకు ఎటువంటి లోటు ఉండదు.

అరచేతిలోని ధన రేఖ (Dhana Rekha) సూర్య పర్వతాన్ని తాకుతూ వెళ్తే.. ఆ వ్యక్తులు చాలా అదృష్టవంతులు. వారు భోగ భాగ్యాలను అనుభవిస్తారు. కంకణం గుండా బయటకు వచ్చే ఏదైనా రేఖ నేరుగా శని పర్వతానికి చేరితే... వారు కూడా చాలా అదృష్టవంతులు. 

విధి రేఖ కంకణం నుంచి నేరుగా శని పర్వతాన్ని చేరితే.. ఆ వ్యక్తులు వ్యాపార రంగంలో బాగా రాణిస్తారు. సంపదను కూడబెడుతారు. పైగా ఆ వ్యక్తులు ప్రసంగ నైపుణ్యంలో ప్రావీణ్యం కలిగి ఉంటారు. వాక్చుతుర్యం ద్వారా వారికి పేరు ప్రతిష్ఠలు, డబ్బు కలుగుతాయి.

సూర్య రేఖ చిటికెన వేలు వైపు శాఖలుగా విడిపోయి ఉంటే.. ఆ వ్యక్తులకు అదృష్టం కలిసొస్తుంది. వారు బిజినెస్ మైండ్ సెట్‌తో ఉంటారు. చాలా మార్గాల్లో వారికి డబ్బు అందుతుంటుంది. అదే సమయంలో డబ్బును వృథా చేయరాదనే విషయం గుర్తించాలి.

Also Read: Village name change: మహా ప్రభో.. మా ఊరి పేరు పరమ బూతు.. పేరు మార్చండి!

Also read: Tonga Island Tsunami: పసిఫిక్ లో అగ్నిపర్వతం విస్ఫోటనం.. టోంగా ద్వీపాన్ని తాకిన సునామి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News