Navratri 2022 Date: సెప్టెంబర్ 26 నుంచి భారత్ వ్యాప్తంగా నవరాత్రులు గడియలు మొదలవుతాయి. అయితే సెప్టెంబర్ 25న తెలుగు రాష్ట్రాల్లో పెద్దల పండుగను జరుపుకుంటారు. అనంతరం శరన్నవరాత్రులు మొదలవుతాయి. అయితే ఈ నవరాత్రుల్లో భాగంగా భారతీయులంతా దుర్గాదేవిని పూజిస్తారు. ఈ క్రమంలో చాలామంది ఉపవాసాలు కూడా పాటిస్తారు. తను పాటించడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు లభించడంతోపాటు దేవి అనుగ్రహం లభిస్తుందని భారతీయుల నమ్మకం. కాబట్టి నవరాత్రుల్లో దేవీ భక్తులంతా ఉపవాసాలు పాటిస్తారు. శరన్నవరాత్రుల్లో వివిధ రాష్ట్రాల్లో వివిధ రూపాలతో అమ్మవారిని పూజిస్తారు. ఏడాదికి నాలుగు నవరాత్రి ఉన్న ఇది ఎంతో ప్రత్యేకమైన నవరాత్రిగా చెప్పవచ్చు. ఈ నవరాత్రి సందర్భంగా భక్తులు శక్తి పీఠాలను దర్శిస్తూ ఉంటారు. ఇలా దర్శించడం వల్ల మోక్షం లభిస్తుందని శాస్త్రం పేర్కొంది.
ఇక నవరాత్రుల ఉత్సవాల విషయానికొస్తే.. దేశవ్యాప్తంగా వివిధ రకాలుగా జరుపుకుంటారు. ఇక తెలుగు రాష్ట్రాలకు వస్తే అమ్మవారి క్షేత్రమైన విజయవాడలోని కనకదుర్గాను భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుంటారు. అయితే ఇలా దర్శించుకుని పూజించడం వల్ల వాళ్ల జీవితాలు కలిగే దుఃఖాలు దూరం అవుతాయని భక్తుల నమ్మకం. ఈ క్రమంలో నవరాత్రులకు పూజలు చేసే వారు ఒక్కొక్క రోజున దేవి ఒక్కొక్క రూపంలో దర్శనమిస్తుంది.
కాబట్టి పూజా క్రమంలో మార్పులు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఆరోజు అమ్మవారి అవతారాన్ని బట్టి పూజా కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని శాస్త్రీయ పనులు పేర్కొన్నారు. నవరాత్రులలో భాగంగా సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5దాకా ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ఈ అవతారాలను దృష్టిలో పెట్టుకొని తప్పకుండా పూజా కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. అయితే ఈ ఎప్పుడు అమ్మవారు ఏ అవతారంలో ఉంటారో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం..
>>26 సెప్టెంబర్ న శైలపుత్రి
>>27 సెప్టెంబర్ 2022 న బ్రహ్మచారిణి
>>28 సెప్టెంబర్ 2022న చంద్రఘంట
>>29 సెప్టెంబర్ 2022 న కూష్మాండ
>>01 అక్టోబరు 2022న స్కందమాత
>>02 అక్టోబర్ 2022న తల్లి కాళరాత్రి
>>03 అక్టోబర్ 2022న మహాగౌరి
>>04 అక్టోబర్ 2022న సిద్ధిదాత్రి
>>05 అక్టోబర్ 2022న దుర్గా మాత
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook