Narasimha Jayanti 2023: అధర్మాన్ని నాశనం చేయడనికి శ్రీమహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తాడు. అందులో భాగంగానే ఈ ఉగ్ర నరసింహ అవతారం ఒకటి. విష్ణువు 12 అవతారాలలో నరసింహ ఆరవ అవతారం. అన్ని దేవతల్లో నరసింహుడిని శక్తి వంతుడిగా శాస్త్రాలు చెబుతున్నాయి. అధర్మంతో నడిచేవారిని, దౌర్జన్యాలు చేసేవారికి నరసింహుడు కఠినంగా ఆయన పద్ధతిలో శిక్షంచేవారు. వైశాఖ మాసంలోని శుక్ల పక్ష చతుర్దశి రోజున తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి ఉగ్ర రూపం ధరించి హిరణ్యకశిపుని అతి కృరంగా చంపాడు. దీంతో ప్రహ్లాదునికి అన్ని సమస్యల నుంచి ఉపశమనం లభించింది. అప్పటి నుంచే మే 4న నరసింహ జయంతి జరుపుకుంటున్నారు.
పురాణాల ప్రకారం.. నరసింహం అంటే వెలుగని.. వారంలో ఒక్కరోజైన నరసింహ స్వామిని పూజించడం వల్ల శత్రువులను ఓడించే శక్తి లభిస్తుంది. సూర్యాస్తమయానికి ముందు నరసింహ వ్రతాన్ని చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా కొందరు భక్తులు ఉపవాసాలు కూడా పాటిస్తారు. ఈ సమయంలో పూజలు చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
Also read: Shani Jayanti 2023: శని జయంతి రోజు ఈ ఉపాయాలు పాటిస్తే శని దోషం, దుష్ప్రభావాల్నించి ఉపశమనం
పూజా పద్ధతి:
నరసింహ వ్రతాన్ని ఆచరించేవారు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా శుభ్రం చేసిన తర్వాత తల స్నా చేసి లక్ష్మినరసింహ విగ్రహాన్ని ప్రతిష్టించాల్సి ఉంటుంది. ఈ పూజా కారక్రమంలో పంచామృతం, పండ్లు, పువ్వులు, కుంకుమ, కొబ్బరి, అక్షతలను సిద్ధం చేసుకుని విగ్రహానికి అలంకరించాల్సి ఉంటుంది. " శ్రీ నరసింహ ఓం నరసింహాయ వరప్రదాయ నమః " అంటూ పూజా కార్యక్రమం ప్రారభించాల్సి ఉంటుంది. ఈ వ్రతం ముగిసిన తర్వాత నిరు పేదలకు వస్తువులను దానం చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
వ్రత ప్రయోజనాలు:
Also read: Shani Jayanti 2023: శని జయంతి రోజు ఈ ఉపాయాలు పాటిస్తే శని దోషం, దుష్ప్రభావాల్నించి ఉపశమనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Narasimha Jayanti 2023: నరసింహ జయంతి రోజు ఇలా వ్రతాన్ని ఆచరిస్తే! జీవితంలో శత్రువులే ఉండరు!