Narali Purnima 2022: నరాలి పూర్ణిమ అంటే ఏంటి? ఈ పండుగను ఎవరు జరుపుకుంటారు?

Narali Purnima 2022: నరాలి పూర్ణిమ పండుగను ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ పండుగ ఈసారి ఆగస్టు 12న జరుపుకోనున్నారు.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 11, 2022, 04:53 PM IST
Narali Purnima 2022: నరాలి పూర్ణిమ అంటే ఏంటి? ఈ పండుగను ఎవరు జరుపుకుంటారు?

Narali Purnima 2022 Puja Vidhanam: నరాలి పూర్ణిమ మత్స్యకారుల యెుక్క పండుగ. దీనిని శ్రావణ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది నరాలి పూర్ణిమ (Narali Purnima 2022) రేపు అంటే ఆగస్టు 12న జరుపుకోనున్నారు. ఈ రోజున ప్రజలు ఉపవాసం ఉండి... వరుణ దేవుడి లేదా సముద్ర దేవుడిని పూజిస్తారు. అంతేకాకుండా పూజ సమయంలో ఆయనకు కొబ్బరి కాయను సమర్పిస్తారు. అందుకే దీనిని నరాలి పూర్ణిమ లేదా కొబ్బరి పూర్ణిమ అంటారు. మహారాష్ట్ర మరియు కొంకణి ప్రాంతంతో పాటు, గోవా, గుజరాత్ తీర ప్రాంతాలలో కూడా ఈ పండుగను ఎక్కువగా జరుపుకుంటారు. 

శుభ ముహూర్తం
శ్రావణ పూర్ణిమ ప్రారంభం: 10:38 ఉ. (ఆగస్టు 11, 2022, రోజు గురువారం)
శ్రావణ పూర్ణిమ ముగింపు: 7:05 ఉ. (ఆగస్టు 12, 2022, శుక్రవారం రోజు)
సూర్యోదయం: 6:05 ఉ. (12 ఆగస్టు 2022)
సూర్యాస్తమయం: 6:58 సా. (12 ఆగస్టు 2022)

పూజ విధానం
నరాలి పూర్ణిమ పండుగను ప్రధానంగా మత్స్యకారులు జరుపుకుంటారు. ఈ రోజున సముద్ర దేవుడిని పూజిస్తారు. ఈ రోజున సముద్ర దేవుడికి కొబ్బరికాయను సమర్పిస్తారు. దీంతో సముద్రంలో ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు ఆ దేవుడు రక్షిస్తాడని నమ్ముతారు. ఈ పండుగను శ్రావణ మాసంలో వస్తుంది కాబట్టి ఈ రోజున శివుడిని పూజిస్తారు. నరాలి పూర్ణిమ చేపల వేట సీజన్ ప్రారంభాన్ని సూచిస్తుంది. 

Also Read: Rakhi Festival 2022: రాఖీ పండుగ నుండి 5 రాశులవారికి గోల్డెన్ డేస్! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News