Naga Panchami 2022: నాగ పంచమి తేదీ, పూజా ముహూర్తం తెలుసా.. పూజకు ఈ సామాగ్రి తప్పనిసరి..

Naga Panchami 2022: ఈసారి శ్రావణ మాసంలో నాగ పంచమి ఏ తేదీన వస్తుంది... పూజా ముహూర్తం ఎన్ని గంటలు.. పూజా సామాగ్రిగా ఏ వస్తువులు తప్పనిసరి.. అన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 6, 2022, 04:05 PM IST
  • నాగ పంచమి ఎప్పుడు, పూజా ముహూర్తం ఎన్ని గంటలు
  • నాగ పంచమి పూజా సామాగ్రి వస్తువులేంటి..
  • పూర్తి వివరాలు ఇక్కడ చదవండి
Naga Panchami 2022: నాగ పంచమి తేదీ, పూజా ముహూర్తం తెలుసా.. పూజకు ఈ సామాగ్రి తప్పనిసరి..

Naga Panchami Puja 2022: హిందూ మతంలో శ్రావణ మాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హిందువులు శ్రావణ మాసాన్ని పవిత్ర మాసంగా భావిస్తారు. ఈ మాసంలో పరమ శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇదే మాసంలో నాగ పంచమి లేదా నాగుల పంచమి కూడా వస్తుంది. శ్రావణ మాసం శుక్ల పక్షం ఐదవ రోజున నాగ పంచమి జరుపుకుంటారు. ఈరోజున నాగదేవతకు ప్రత్యేక పూజలు చేస్తారు. నాగ పంచమి రోజున నాగ దేవతను పూజించడం ద్వారా కోరుకున్న కోర్కెలు నెరవేరుతాయని నమ్ముతారు.

నాగ పంచమి తేదీ, పూజా ముహూర్తం :

నాగ పంచమి ఈసారి ఆగస్టు 2న జరుపుకోనున్నారు. ఆరోజు ఉదయం 05:14 గంటలకు పంచమి తిథి ప్రారంభమవుతుంది.ఆగస్టు 3వ తేదీ ఉదయం 05:42 గంటల వరకు ఈ తిథి ఉంటుంది. . నాగ పంచమి పూజ ముహూర్తం ఆగస్టు 2, ఉదయం 05:42 నుంచి ఉదయం 08:24 వరకు ఉంటుంది. ముహూర్తపు వ్యవధి 2 గం. 4 నిమిషాల పాటు ఉంటుంది. 

కాలసర్ప దోష విముక్తి :

నాగ పంచమి రోజున నాగ దేవతను పూజించడం ద్వారా కాలసర్ప దోషం నుంచి విముక్తి లభిస్తుంది. నాగ దేవత ఆరాధనతో ఇంట్లో సుఖ సంతోషాలు, శాంతి, శ్రేయస్సు కలుగుతాయి. భక్తులు కోర్కెలు నెరవేరుతాయి. 

నాగ పంచమి పూజా సామగ్రి

నాగ పంచమి నాడు నాగ దేవతను పూజించడానికి ప్రత్యేక సామాగ్రి అవసరం. పాలు, పువ్వులు, తేనె, గంగాజలం, పంచ మిఠాయి, బిల్వపత్రం, ధాతుర, ఐదు పండ్లు, ఐదు కాయలు, రత్నాలు, బంగారం, వెండి, దక్షిణ, పెరుగు, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, గంజాయి, రేగు, పవిత్ర జలం, పంచ రసాలు, అగర్బత్తులు, ఆమ్ మంజరి, తులసి దళం, మందార పువ్వు, ఆవు పచ్చి పాలు, కర్పూరం, ధూపం, పత్తి, మలయగిరి, చందనం  తప్పనిసరిగా ఉండాలి. శివుడు, పార్వతి చిత్రపటాలు, వాటిని అలంకరించే సామాగ్రి ఉండాలి. 

(నిరాకరణ: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
 

Also Read: Fraud Case: హైదరాబాద్‌లో బోర్డు తిప్పేసిన మరో కంపెనీ..లబోదిబోమంటున్న బాధితులు..!

Also Read: Reverse Akarsh: అప్పుడు వచ్చారు.. ఇప్పుడు పోతున్నారు! రివర్స్ ఆకర్ష్ తో గులాబీలో గుబులు.. 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News