Budh Gochar 2022: గ్రహాల యువరాజు బుధుడు ప్రస్తుతం వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. డిసెంబరులో బుధ గ్రహం రెండు సార్లు వేర్వేరు రాశులలో (Mercury transit 2022) సంచరించనుంది. బుద్ధి మరియు కమ్యూనికేషన్ కు కారకుడైన బుధుడు మెుదట ధనస్సు రాశిలో, ఆ తర్వాత మకరరాశిలో సంచరించనున్నాడు. వచ్చే నెలలో రెండు సార్లు బుధుడి తన రాశిని మార్చడం వల్ల దాని ప్రభావం కొన్ని రాశులవారిపై నెగిటివ్ ప్రభావం పడుతుంది. బుధ సంచారం వల్ల ఏయే రాశులవారు నష్టపోనున్నారో తెలుసుకుందాం.
మేషరాశి (Aries): మకరరాశిలో బుధుడు సంచరించడం వల్ల ఈ రాశి వారి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. ధనస్సు రాశిలో బుధుడి సంచారం వల్ల మీ తండ్రి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మెుత్తానికి మీకు బ్యాడ్ టైమ్ నడుస్తోంది.
మిధునరాశి (Gemini): ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరగడం వల్ల ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చు. మీ తల్లి ఆరోగ్యం కూడా క్షీణించవచ్చు. మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఆఫీసులో మీకు సమయం అంతగా అనుకూలంగా ఉండకపోవచ్చు. ఇతరులతో సంభాషించేటప్పుడు ఆలోచించి మాట్లాడండి.
కర్కాటకం(Cancer): బుధగ్రహం యొక్క ఈ రాశి మార్పు కారణంగా మీరు కాలేయ సంబంధిత సమస్యలను ఎదుర్కోనే అవకాశం ఉంది. సిగరెట్, మద్యం వంటి వాటికి దూరంగా ఉండండి. ఈ సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. మీరు జాగ్రత్తగా ఉండండి.
మకరరాశి (Capricorn): మకరరాశిలో బుధుడు సంచరించడం వల్ల మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ప్రణాళిక వేసుకుని ఖర్చు చేయండి, లేకుంటే మీరు ఇబ్బందులు పడతారు. హెల్త్ చెడిపోయే అవకాశం ఉంది.
కుంభ రాశి (Aquarius): మకరరాశిలో బుధుడు సంచరించడం వల్ల మీకు ఆర్థికంగా కలిసి రాదు. ఆరోగ్యం విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ, వ్యాపారాలు దెబ్బతినే అవకాశం ఉంది. వివాదాలకు దూరంగా ఉండండి. మెుత్తానికి ఈ సమయం మీకు అంతగా కలిసి రాదు.
Also Read: Astrology: ధనుస్సు రాశిలో సూర్య, శుక్రుల కలయిక... ఈ 4 రాశులకు అదృష్ట యోగం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి