Budh Gochar 2023: కొన్ని గంటల్లో మేషరాశిలోకి బుధుడు... రాత్రికి రాత్రే ధనవంతులు కానున్న రాశులివే..!

Budh Gochar 2023: సంపద, తెలివితేటలు మరియు వ్యాపారాలకు కారకుడైన బుధుడు మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. మెర్క్యూరీ యెుక్క రాశి మార్పు కారణంగా నాలుగు రాశులవారికి మేలు జరగనుంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 31, 2023, 12:10 PM IST
Budh Gochar 2023: కొన్ని గంటల్లో మేషరాశిలోకి బుధుడు... రాత్రికి రాత్రే ధనవంతులు కానున్న రాశులివే..!

Mercury Transit 2023 effects: గ్రహాల రాకుమారుడైన బుధుడు ఇవాళ అంటే మార్చి 31, శుక్రవారం మధ్యాహ్నం 2.44 గంటలకు మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. డబ్బు, వ్యాపారం, తెలివితేటలు మరియు కమ్యూనికేషన్‌కు కారకుడిగా మెర్క్యూరీని భావిస్తారు.  బుధుడి రాశి మార్పు మెుత్తం 12 రాశులవారిని ప్రభావితం చేస్తుంది. బుధుడి సంచారం ఏయే రాశులవారికి ప్రయోజనం చేకూరుస్తుందో తెలుసుకుందాం. 

బుధుడి సంచారం ఈరాశులకు వరం
మిథునం: మిథునరాశి వారికి బుధ సంచారం చాలా శుభప్రదం అవుతుంది. మీరు వ్యాపారంలో భారీ లాభాలను పొందుతారు. ఉద్యోగులు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది.  వివిధ మార్గాల ద్వారా ఆదాయం  సమకూరుతుంది. 
కర్కాటకం: బుధుడు రాశి మార్పు కర్కాటక రాశి వారి జీవితంలో బంగారు రోజులు ప్రారంభమవుతాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. మీరు కెరీర్‌లో ముందుకు సాగుతారు. ఉద్యోగం లేదా వ్యాపారంలో పురోగతి ఉంటుంది.
సింహం: మేషరాశిలోకి బుధుడు ప్రవేశించడం వల్ల సింహరాశి వారికి చాలా లాభాలు చేకూరుతాయి. మీరు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. మీ ఆదాయం పెరుగుతుంది. జీతం రెట్టింపు అవుతుంది. మీ ఆర్థిక స్థితి బలపడుతుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. బిజినెస్ లో మీరు పెద్ద పెద్ద ఆర్డర్ లను పొందుతారు. ఈ సమయం విద్యార్థులకు కలిసి వస్తుంది. 
మకరం: మెర్క్యూరీ సంచారం మకర రాశి వారికి గొప్ప ప్రయోజనాలు చేకూరుతాయి. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. మీరు ప్రమోషన్ పొందవచ్చు. జీతం రెట్టింపు అవుతుంది. ఈ సమయం వ్యాపారవేత్తలకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సంబంధాలు మెరుగ్గా ఉంటాయి.

Also Read: Surya Shani Yuti 2023: మీనంలో ముగిసిన శని-సూర్య కూటమి.. ఈ రాశులకు మంచి రోజులు మెుదలు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News