Budh Gochar 2022: కన్యా రాశిలో బుధుడి సంచారం... ఏ రాశివారికి లాభం?

Budh Gochar 2022: బుధుడు రేపు రాశిని మార్చబోతున్నాడు.  దీని సంచారం వల్ల ఏరాశుల వారు లాభపడనున్నారో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 20, 2022, 10:01 AM IST
Budh Gochar 2022: కన్యా రాశిలో బుధుడి సంచారం... ఏ రాశివారికి లాభం?

Budh Gochar 2022:  గ్రహాల యువరాజు బుధుడు తన రాశిని మార్చోబోతున్నాడు. ప్రస్తుతం సింహరాశిలో ఉన్న బుధుడు.. రేపు అంటే ఆగస్టు 21 ఆదివారం నాడు తెల్లవారుజామున 02:14కి కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ రాశిలోనే అక్టోబర్ 25 వరుకు ఉంటాడు. కన్యారాశిలో బుధ సంచారం కొన్ని రాశులవారికి కలిసి రానుంది. ఆ లక్కీ రాశులేంటో  తెలుసుకుందాం. 

1. వృషభం (Taurus) : కన్యారాశిలో బుధుడు ప్రవేశించడం వల్ల వృషభ రాశి వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోండి. 

2. మిథునం (Gemini): బుధుడి రాశి మార్పు మిథున రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి ఇదే మంచి సమయం. అదృష్టంతో ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. వ్యాపారం విస్తరిస్తుంది. భారీగా లాభాలను ఆర్జిస్తారు. 

3. సింహరాశి (Leo): బుధుడు సంచారం వల్ల సింహ రాశి వారికి కలిసి వస్తుంది. వీరికి ఆస్తి లాభంగా రావచ్చు. ముఖ్యంగా మీరు పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందే అవకాశం ఉంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. 

4. కన్యారాశి (Virgo): బుధుడు కన్యారాశిలోనే సంచరించబోతున్నాడు కాబట్టి ఈ రాశి వారికి లాభం చేకూరుతుంది. ఉద్యోగులు లాభపడతారు. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారులు భారీగా లాభాలను గడిస్తారు.

Also Read: Mercury Transit In Virgo 2022: కన్య రాశిలో బుధ సంచారం... రాబోయే 2 నెలలు ఈ రాశులకు కష్టకాలం! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News