Mercury Transit In Virgo 2022: కన్య రాశిలో బుధ సంచారం... రాబోయే 2 నెలలు ఈ రాశులకు కష్టకాలం!

Mercury Transit In Virgo : గ్రహాల యువరాజు అయిన బుధుడు రేపు రాశిని మార్చబోతున్నాడు. ఇది కొన్ని రాశులవారికి కష్టాలను కలిగించనుంది. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 20, 2022, 08:41 AM IST
 Mercury Transit In Virgo 2022: కన్య రాశిలో బుధ సంచారం... రాబోయే 2 నెలలు ఈ రాశులకు కష్టకాలం!

Mercury Transit In Virgo 2022: బుధుడు రేపు అంటే ఆగస్టు 21న కన్యా రాశిలోకి ప్రవేశించనున్నాడు. అక్టోబర్ 25 వరకు అంటే 66 రోజులపాటు అక్కడే ఉండనున్నాడు. ఈ బుధ గ్రహ సంచారం (Mercury Transit In Virgo 2022) కొన్ని రాశులవారికి తీవ్ర ఇబ్బందులను కలిగించనుంది. ఏ రాశివారికి కష్టకాలం ఉంటుందో తెలుసుకుందాం.

ఈ రాశులకి కష్టకాలం 

మేషరాశి (Aries): మెర్క్యురీ సంచారం వల్ల ఈ రాశివారు కష్టాలు పడాల్సి వస్తుంది. పెళ్లయిన వారు అత్తమామలతో జాగ్రత్తగా మాట్లాడాలి, లేదంటే ఇబ్బందులు తలెత్తవచ్చు. ఆఫీసులో జరిగే రాజకీయాలకు దూరంగా ఉండండి. యాబై ఏళ్లు పైబడిన వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ఈ సమయంలో వినాయకుడిని పూజించడం మంచిది. 

కర్కాటకం (Cancer): బుధ సంచారం వల్ల సమాజంలో గౌరవాన్ని కోల్పోవచ్చు. కాబట్టి మితంగా మాత్రమే మాట్లాడండి. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. విద్యార్థులకు ఇది శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశివారు ఆవుకు మేత వేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. 

తులారాశి (Libra): ఈ రాశి యెుక్క పన్నెండో ఇంట్లో ఈ సంచారం జరగనుంది. కాబట్టి లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు మీకు హాని కలిగించవచ్చు. సీక్రెట్స్ ఎవరికీ చెప్పకండి. అలర్జీ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారు బుధవారం చంద్రుడికి పప్పును దానం  చేయండి. 

కుంభరాశి (Aquarius): కుంభ రాశి వారు బుధ సంచార సమయంలో కొంత మానసిక బలహీనతను ఎదుర్కొంటారు. అంతేకాకుండా వీరికి చర్మానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవచ్చు. ఆర్థికంగా ఇబ్బంది పడతారు. దుబారాను తగ్గించుకోండి. ఈ సమయంలో ఉద్యోగులు రెండింతలు కష్టపడాల్సి రావచ్చు. 'ఓం బ్రాం బ్రాం బ్రౌన్స్: బుధాయ నమః' అనే మంత్రాన్ని జపించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. 

మీనరాశి (Pisces): బుధగ్రహ సంచారం వల్ల మీనరాశివారు వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమయంలో మీరు ఇంట్లో వ్యక్తుల గురించి తప్పుడు భావాలను పెంచుకునే అవకాశం ఉంది. దీనికి పరిహారంగా 'ఓం బుధాయ నమః' అనే మంత్రాన్ని రోజూ కనీసం 11 సార్లు జపించాలి.

Also Read: జన్మాష్టమి రోజు రాత్రి తిరోగమనం చెందిన 4 పెద్ద గ్రహాలు.. ఈ రాశులవారు జాగ్రత్త!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News