Budh Gochar 2022: ధనుస్సు రాశిలోకి బుధుడు... ఎవరికి లాభం, ఎవరికి నష్టం...

Budh Gochar 2022: గ్రహాల యువరాజు బుధుడు యెుక్క రాశి మార్పు అనేది చాలా ప్రత్యేకమైనది. దీని సంచారం మెుత్తం 12 రాశులవారిపై పెను ప్రభావాన్ని చూపుతుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 1, 2022, 09:27 AM IST
Budh Gochar 2022: ధనుస్సు రాశిలోకి బుధుడు... ఎవరికి లాభం, ఎవరికి నష్టం...

Budh Gochar 2022: ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల రాకుమారుడి అని పిలుస్తారు. తెలివితేటలు, వ్యాపారం మరియు కమ్యూనికేషన్ కు కారుకుడిగా బుధుడిని భావిస్తారు. ఈ నెలలో వృశ్చికరాశిలో సంచరించనున్న మెర్క్యూరీ.. డిసెంబరు 3న ధనుస్సు రాశిలో (Mercury transit in Sagittarius 2022)సంచరించనున్నాడు. ధనస్సు రాశిలో బుధుడి సంచారం కొన్ని రాశులవారికి అనుకూలంగానూ, మరికొందరికి ప్రతికూలంగానూ ఉంటుంది. బుధ గ్రహ సంచారం ఏ రాశుల వారిని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం.

మేషరాశి (Aries): ఈ రాశి వారికి బుధుడు తృతీయ, ఆరవ గృహాలకు అధిపతి. బుధగ్రహ సంచారం మేషరాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ముందుకు సాగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కెరీర్‌లో కూడా విజయం సాధించవచ్చు. ఈ కాలంలో మీరు మీ తండ్రి ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించవలసి ఉంటుంది. 

వృషభం (Taurus): ఈ రాశి యెుక్క రెండవ మరియు ఐదవ గృహాలకు అధిపతి బుధుడు. దీంతో వృషభరాశివారికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఈ సమయంలో మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి.

కర్కాటకం (Cancer): కర్కాటక రాశి వారికి బుధుడు 3వ మరియు 12వ గృహాలకు అధిపతి. బ్యాంకింగ్ తదితర రంగాలకు సంబంధించిన వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. అయితే ఈ సమయంలో ఆరోగ్యపరమైన సమస్యలు ఉండవచ్చు. 

సింహరాశి (Leo): ఈ రాశి వారికి బుధుడు రెండవ మరియు 11వ గృహాలకు అధిపతి. స్టాక్ మార్కెట్ మొదలైన రంగాలకు సంబంధించిన వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. అయితే మీరు పెట్టుబడి నుండి కూడా ప్రయోజనం పొందవచ్చు. వైవాహిక జీవితం బాగుంటుంది. 

మకరరాశి (Capricorn): మకర రాశి వారికి బుధుడు ఆరు మరియు తొమ్మిదవ ఇంటికి అధిపతి. ఈ కాలంలో ఈ రాశివారి ఖర్చులు పెరగడంతోపాటు ఆర్థిక సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. కొంత నష్టం కూడా ఉండవచ్చు. ఆరోగ్యం పట్ల అదనపు శ్రద్ధ తీసుకోండి.

Also Read: Grah Gochar 2022: నవంబరులో ఒకే రోజు 2 పెద్ద గ్రహాలు రాశి మార్పు.. వీరి కెరీర్ లో అద్భుతమైన పురోగతి.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3P3R74U   

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News