Mercury transit 2022: జూలై 31న రాశిని మార్చబోతున్న బుధుడు.. 21 రోజులపాటు ఈ 5 రాశులవారిపై డబ్బు వర్షం!

Mercury transit 2022: మరో నాలుగు  రోజుల్లో బుధుడు రాశిని మార్చబోతున్నాడు. దీని సంచారం 5 రాశులవారికి కలిసి రానుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 27, 2022, 08:46 AM IST
  • బుధుడి స్థానం మార్పు
  • ఈ రాశులవారికి అదృష్టం
Mercury transit 2022: జూలై 31న రాశిని మార్చబోతున్న బుధుడు.. 21 రోజులపాటు ఈ 5 రాశులవారిపై డబ్బు వర్షం!

Budh Gochar 2022: బుధ గ్రహం...తెలివితేటలు, తర్కం, డబ్బు, వ్యాపారానికి కారకుడు. బుధ గ్రహం మరో నాలుగు రోజుల్లో తన రాశిని మార్చబోతుంది. జూలై 31, 2022 అర్థరాత్రి సింహరాశిలోకి (Mercury transit in Leo 2022) ప్రవేశించనుంది. ఆగస్టు 21 వరకు అక్కడే ఉండనున్నాడు. దీని రాశి మార్పు మెుత్తం 12 రాశులపై పెను ప్రభావం చూపనుంది. ముఖ్యంగా సింహరాశిలో బుధుడి సంచారం 5 రాశుల వారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.

మేషం (Aries): బుధుడు రాశి మార్పు మేషరాశి వారికి అనేక సంతోషాలను ఇస్తుంది. ఈ రాశివారు కష్టపడి పనిచేస్తారు. అదేవిధంగా వీరికి అదృష్టం కూడా కలిసి వస్తుంది. వీరు కొత్త బాధ్యతలు తీసుకుంటారు. టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. ఈ సమయం ప్రేమ జంటలకు అనుకూలంగా ఉంటుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. 

సింహం (Leo): సింహ రాశి వారికి బుధ సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. వీరి కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతంగా ఉంటాయి. ధనం లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగ-వ్యాపారాలలో భారీగా లాభాలను ఆర్జిస్తారు. భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.

కన్య (Virgo): మెర్క్యురీ సంచారం కన్య రాశి వారికి మేలు చేస్తుంది. ఈ రాశివారు అదృష్టంతో ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారస్తుల పనులు చక్కగా సాగుతాయి. కుటుంబంతో సంబంధాలు మెరుగవుతాయి. కొత్త జాబ్ వస్తుంది. 

ధనుస్సు (Sagittarius): ధనుస్సు రాశి వారికి ఆగష్టు మాసం కలిసి వస్తుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. పెళ్లికాని వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. ఆదాయం మెరుగ్గా ఉంటుంది.  

కుంభం (Aquarius): బుధ సంచారం కుంభ రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి.  ప్రమోషన్ రావచ్చు. వ్యాపారస్థులు లాభ పడతారు. పెళ్లికాని వారు వివాహం చేసుకునే అవకాశం ఉంది.  సమాజంలో గౌరవం పెరుగుతుంది. అదృష్టం కలిసి వచ్చి...కొన్ని పనులు పూర్తి చేస్తారు. 

Also Read: Hariyali Amavasya 2022: హరియాళీ అమావాస్య ఎందుకు జరుపుకుంటారు?

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News