Budhaditya Rajyog: మరో 3 రోజుల్లో ఈ 3 రాశుల సుడి తిరగబోతుంది.. మీరున్నారా?

Mercury transit 2023: జూన్ 07న బుధుడు, సూర్యుడు కలిసి బుధాదిత్య రాజయోగం చేయనున్నారు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశులవారికి అదృష్టం పట్టనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 4, 2023, 04:36 PM IST
Budhaditya Rajyog: మరో 3 రోజుల్లో ఈ 3 రాశుల సుడి తిరగబోతుంది.. మీరున్నారా?

Budhaditya Rajyog in Vrishabha Rashi 2023: మరో మూడు రోజుల్లో గ్రహాల యువరాజైన బుధుడు వృషభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. సూర్యుడు ఇప్పటికే అదే రాశిలో సంచరిస్తున్నాడు. వృషభరాశిలో ఈ రెండు గ్రహాల కలయిక వల్ల అరుదైన బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఇది కేవలం ఎనిమిది రోజులు మాత్రమే ఉండనుంది. బుధాదిత్య రాజయోగం వల్ల మూడు రాశులవారు లాభాలను పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.

బుధాదిత్య యోగం ఈ 3 రాశులకు లాభదాయకం
వృషభం: ఈ రాశిలో బుధుడి సంచారంతోపాటు బుధాదిత్య రాజయోగం కూడా ఏర్పడబోతుంది. దీంతో ఈ రాశివారు ఊహించని ధనాన్ని పొందనున్నారు. అంతేకాకుండా ఆకస్మిక ధనలాభం కూడా ఉంది. వీరు ప్రతి పనిలో సక్సెస్ అవుతారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం వస్తుంది. ఈ రాశి వారి కోరికలన్నీ నెరవేరుతాయి. 
కన్య: బుధాదిత్య రాజయోగం కన్యారాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. మీ అదృష్టం కలిసి వస్తుంది. అంతేకాకుండా మీరు విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. మీ పని లేదా వ్యాపార నిమిత్తం ప్రయాణం చేసే అవకాశం ఉంది. మీరు ధార్మిక, శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. 

Also Read: Grah Gochar 2023: ఈ నెలలో రాశిని మార్చనున్న 3 పెద్ద గ్రహాలు.. ఈ 4 రాశులకు సమస్యలు పెరగడం ఖాయం..

సింహ రాశి : ఈ రాశి వారికి బుధాదిత్య రాజయోగం మంచి ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగులు లాభపడతారు. మీకు ఉద్యోగం వస్తుంది. వ్యాపారులు లాభపడతారు, అంతేకాకుండా బిజినెస్ విస్తరిస్తారు. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మెుత్తానికి ఈ సమయం బాగుంటుంది. 

Also Read: Shani Vakri 2023: శష్ రాజయోగంతో మారనున్న ఈ 3 రాశుల ఫ్యూచర్.. మీది ఉందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News