Budh Asta 2023 effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఫ్లానెట్స్ ప్రిన్స్ బుధుడు ఫిబ్రవరి 27 సాయంత్రం శని రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశించాడు. అంతేకాకుండా సూర్యుడితో బుధాదిత్యయోగాన్ని కూడా ఏర్పరిచాడు. అనంతరం తర్వాత రోజునే అంటే ఫిబ్రవరి 28న ఉదయం 8:30 గంటలకు అదే రాశిలో మెర్య్కూరీ అస్తమించాడు. మళ్లీ మెర్య్కూరీ మార్చి 31, మధ్యాహ్నం 2.44 గంటలకు ఉదయించనున్నాడు. బుధుడి అస్తమయ సమయంలో శుభాల కంటే అశుభాలే ఎక్కువగా ఉంటాయి. బుధుడి సెట్ వల్ల ఏయే రాశులవారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.
మిధునరాశి
బుధుడు మీరాశి యెుక్క తొమ్మిదవ ఇంట్లో అస్తమించాడు. మిథునరాశి యెుక్క మొదటి మరియు నాల్గవ ఇంటికి బుధుడు అధిపతి. దీని కారణంగా మీరు అనేక సమస్యలను ఎదుర్కోంటారు. మీరు ఏ పని చేసినా అందులో అడ్డంకుల వస్తాయి. సమయానికి వర్క్ పూర్తవ్వదు. ఆఫీసులో సహచరులతో విభేదాలు రావచ్చు.
సింహరాశి
ఈ రాశిలో బుధుడు సప్తమ స్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా బుధుడు రెండవ మరియు పదకొండవ ఇంటికి అధిపతి. దీని కారణంగా మీ కెరీర్ ఒడిదుడుకులకు లోనవుతుంది. వ్యాపారంలో సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. దాంపత్య జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తాయి.
కన్య రాశి
ఈ రాశిలో బుధుడు ఆరవ ఇంట్లో అస్తమిస్తున్నాడు. కన్యా రాశి యెుక్క మొదటి మరియు పదవ ఇంటికి బుధుడు అధిపతి. ఉద్యోగంలో సమస్యలు వస్తాయి. సడన్ గా మీరు ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు మరింత శ్రమించాల్సి ఉంటుంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి యెుక్క నాల్గవ ఇంట్లో బుధుడు అస్తమిస్తున్నాడు. దీని కారణంగా మీరు వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు. పై అధికారులతో సంబంధాలు చెడిపోతాయి. వ్యాపారం బాగుండదు. కుటుంబంలో విభేదాలు వస్తాయి. పనిలో ఆటంకాలు ఏర్పడతాయి. ఆరోగ్యం చెడిపోయే అవకాశం కూడా ఉంది.
Also Read: Shani Dev uday 2023: వచ్చే వారంలో కీలక పరిణామం.. ఈరాశులకు పట్టనున్న అదృష్టం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.