Mercury Retrograde in Aries 2023: ఏప్రిల్ 21న మేషరాశిలో బుధుడు.. 4 రాశులవారికి ఊహించని లాభాలు

Mercury Retrograde 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం ఒక్కొక్క గ్రహానికి ఒక్కో ప్రత్యేకత, ప్రాదాన్యత ఉన్నాయి. అదే విధంగా బుధుడిని  తర్కానికి ప్రతిరూపంగా భావిస్తారు. బుధుడి రాశి పరివర్తనం వివిధ రాశులపై వేర్వేరుగా ఉంటుంది. బుధుడు ఇప్పుడు మేష రాశిలో ప్రవేశించనున్నాడు. ఆ వివరాలు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 8, 2023, 07:57 AM IST
Mercury Retrograde in Aries 2023: ఏప్రిల్ 21న మేషరాశిలో బుధుడు.. 4 రాశులవారికి ఊహించని లాభాలు

Mercury Retrograde in Aries 2023: గ్రహాల రాశి పరివర్తనం లేదా గోచారం ప్రభావం అన్ని రాశులపై పడినా.. కొన్ని రాశులకు అత్యంత అనుకూలంగా, కొన్ని రాశులకు తీవ్రంగా ఉంటుంది. ఇందులో భాగంగానే బుధుడి మేష రాశి ప్రవేశం 4 రాశులకు ఊహించని లాభాల్ని తెచ్చిపెట్టనుంది. ఆ వివరాలు మీ కోసం.

జ్యోతిష్యం ప్రకారం బుధ గ్రహాన్ని తర్కం, బుద్ధికి ప్రతీకగా పిలుస్తారు. మేష రాశి మూడవ, ఆరవ పాదానికి అధిపతి బుధుడు. బుధుడు ఏప్రిల్ 21వ తేదీన మేష రాశి తొలి పాదంలో వక్రమార్గం చేయనున్నాడు. బుధుడి వక్రం వివిధ రాశులపై మిశ్రమ ఫలితాలనిస్తుంది. ఈ సమయంలో వ్యాపారం, కెరీర్, ఉద్యోగం ఇలా ఆన్ని రంగాల్లో వృద్ధి సాధిస్తారు. ఇక నెగెటివ్ విషయాల్ని పరిశీలిస్తే ఆరోగ్యం సంబంధ సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. నాలుగు రాశులకు ఆర్ధిక ఇబ్బందులు దూరమౌతాయి. ఆ నాలుగు రాశులేంటో పరిశీలిద్దాం..

తుల రాశి:

బుధుడి మేషరాశిలో వక్రీకరణ ఈ రాశిపై మిశ్రమంగా ఉంటుంది. ఉద్యోగంలో ఇంక్రిమెంట్లతో పాటు కొత్త బాధ్యతలు లభిస్తాయి. దీంతో జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. వ్యాపారం విస్తృతమౌతుంది. తండ్రి ఆరోగ్యంపై ఎక్కువ ఖర్చు ఉంటుంది. ఉద్యోగంలో మార్పు ఉండవచ్చు. ఆర్ధికంగా ఇబ్బందులుండవు.

Also Read: Surya Gochar 2023: వచ్చే నెల రోజులపాటు ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.. ఇందులో మీరున్నారా?

ధనస్సు రాశి:

బుధుడి మేషరాశి వక్రీకరణ ప్రభావం ఈ రాశివారిపై సానుకూలంగా ఉంటుంది. మీ పనితీరు, వ్యవహారశైలితో ఇతరుల్ని ప్రభావితుల్ని చేస్తారు. మీ పనితీరుపై తోటి ఉద్యోగులు, పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి. పని నిమిత్తం విదేశాలకు వెళ్లవచ్చు. వ్యాపార భాగస్వామి తరపు నుంచి పూర్తి సహకారం లభించదు. ఫలితంగా నష్టాలు ఎదుర్కోవల్సి వసతుంది. పిల్లల ఆరోగ్యంలో సమస్యలు రావచ్చు.

మేష రాశి:

బుధ గ్రహం వక్రమార్గం కారణంగా ఈ రాశి జాతకులు జీవితానికి సంబంధించి తీసుకునే నిర్ణయాలు అనుకూల ఫలితాలనిస్తాయి. ఉద్యోగస్థులకు వృద్ధి ఉంటుంది. పదోన్నతితో పాటు మంచి ఇంక్రిమెంట్లు లభిస్తాయి. వ్యాపారంలో ఊహించని లాభాలుంటాయి. పోటీదారుల్ని వెనక్కి నెట్టి ముందుకెళ్లిపోతారు. 

సింహ రాశి:

బుధ గ్రహం మేష రాశిలో వక్రమార్గం ప్రభావం సింహ రాశి జాతకులపై అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. అదృష్టం పూర్తిగా తోడుగా నిలుస్తుంది. తమ సామర్ధ్యాల్ని గుర్తించి పనిచేస్తారు. దాని లాభం కూడా కలుగుతుంది. వ్యాపారంలో అపార విజయం లభిస్తుంది. తీర్ధయాత్రలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. పనిచేసే చోట ఆత్మ విశ్వాసం ఉంటుంది.

Also Read: Guru Chandal Yog 2023: బృహస్పతి-రాహు కలయిక.. ఈ 3 రాశుల వారి జీవితంలో గందరగోళం! డబ్బు నష్టపోయే అవకాశం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News