Mercury Retrograde 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహాన్ని వివిధ అంశాలకు కారకుడిగా భావిస్తారు. అదే విధంగా గ్రహల్లో యువరాజుగా భావించే బుధుడిని బుద్ధి, తర్క సామర్ధ్యం, వ్యాపారానికి ప్రతీకగా పరిగణిస్తారు. అందుకే బుధుడి గోచారం లేదా తిరోగమనం అనేది వివిధ రాశులపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది.
బుధుడు ఆగస్టు 24 అంటే రేపట్నించి తిరోగమనం అంటే వక్రమార్గం పట్టనున్నాడు. అనంత విశ్వంలో చంద్రుని తరువాత చిన్నదైన, వేగంగా కదిలే గ్రహమిదే. బుధ గ్రహం వక్రమార్గంతో పాటు అస్తమించడం కూడా జరుగుతుంది. దాంతో మొత్తం 12 రాశులపై ప్రభావం పడుతుదంటున్నారు జ్యోతిష్యులు. కొన్ని రాశులకు మాత్రం అదృష్టం తిరిగిపోతుంది. ముఖ్యంగా 3 రాశులకు ఊహించని లాభాలు కలగనున్నాయి. ధనలాభం ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలు బాగుంటాయి. స్వతహాగా తెలివైనవారు కావడంతో తెలివిగా వ్యవహరించి వ్యవహారాలు చక్కబెట్టగలుగుతారు.
రేపట్నించి బుధ గ్రహం తిరోగమనం చెందనుండటంతో కన్యా రాశి జాతకులకు విశేషమైన లాభాలు కలగనున్నాయి. ఎందుకంటే బుధ గ్రహం కన్యా రాశికి అధిపతి. బుధుడి వక్రమార్గం కారణంగా ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంటారు. ఎందుకంటే ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. ఈ జాతకులకు అదృష్టం కలిసొస్తుంది. కెరీర్ పరంగా ఉన్నత స్థానంలో ఉంటారు. వ్యాపారులకు అంతా అనువైన సమయం.
బుధుడి తిరోగమనం ప్రభావం ముఖ్యంగా వృశ్చిక రాశి జాతకంపై విపరీతంగా ఉంటుంది. ఈ రాశివారికి అదృష్టం తిరిగిపోనుంది. కుటుంబ జీవితం సంతోషమయమౌతుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చు నియంత్రణలో ఉంటుంది. దాంతో ఆర్ధికంగా ఎలాంటి సమస్యలు ఎదురుకావు. వ్యాపారులకు చాలా అనువైన సమయం. ఆర్ధిక ఇబ్బందుల్నించి బయటపడతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
బుధ గ్రహం తిరోగమనం మిధున రాశి జాతకులకు అత్యంత శుభప్రదం కానుంది. గతంలో ఎక్కడైనా నిలిచిపోయిన డబ్బులు ఊహించని విదంగా తిరిగి చేతికి అందుతాయి. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనిచేసే చోట ప్రశంసలు, గుర్తింపు లభిస్తాయి. పాత పెట్టుబడులు మంచి లాభాల్ని ఇస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ రాశి వారికి ఆకశ్మిక ధనలాభం కలుగుతుంది.
Also read: Samsaptaka yogam 2023: సూర్య-శని గ్రహాలతో ఏర్పడిన సంసప్తక యోగం, ఆ మూడు రాశులపై ఊహించని ధన సంపదలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook