Raj Yog: 30 ఏళ్ల తర్వాత గ్రహాల సంచారంలో అరుదైన మార్పులు.. జూలైలో ఈ 4 రాశుల వారికి రాజయోగంతో అన్నీ విజయాలే..

Mercury Shani Conjuction: గ్రహాల స్థితిగతులు రాశిచక్రంలోని 12 రాశుల వారి జీవితాలపై ప్రభావం చూపుతాయి. జూలైలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పులు 4 రాశుల వారికి రాజయోగం తీసుకురానున్నాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 30, 2022, 12:39 PM IST
  • జూలైలో బుధ శుక్ర కలయిక
  • 30 ఏళ్ల తర్వాత కుంభ రాశిలో శని
  • నాలుగు రాశుల వారికి రాజయోగం
Raj Yog: 30 ఏళ్ల తర్వాత గ్రహాల సంచారంలో అరుదైన మార్పులు.. జూలైలో ఈ 4 రాశుల వారికి రాజయోగంతో అన్నీ విజయాలే..

Mercury Venus Conjuction: గ్రహాల కలయిక రాశిచక్రంలోని అన్ని రాశులపై ప్రభావాన్ని చూపుతుంది. జూలైలో వృషభరాశిలో బుధ-శుక్ర సంయోగం ఏర్పడనుంది. అదే సమయంలో 30 సంవత్సరాల తర్వాత న్యాయ దేవుడైన శని త్రిభుజ రాశిచక్రం కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కుంభ రాశిలో శని సంచారం, బుధ-శుక్ర సంయోగం కారణంగా రాజయోగం ఏర్పడనుంది. ఇది ఆయా రాశుల వారి అదృష్టాన్ని మార్చనుంది. ముఖ్యంగా 4 రాశుల వారి అదృష్టం మారనుంది.

ఈ 4 రాశుల వారికి రాజయోగంతో అన్నీ విజయాలే :

వృషభం : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, వృషభ రాశి వారి గృహంలో రాజయోగం ఏర్పడుతోంది, ఇది వారి కెరీర్ దిశను మార్చగలదు. తద్వారా పెద్ద పదవి పొందే అవకాశం ఉంటుంది. పెద్ద జీతం, ఉన్నత స్థానంతో ఉద్యోగం లభించవచ్చు. ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు పూర్తి అనుకూల సమయం. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మీ పట్ల అందరిలో గౌరవం పెరుగుతుంది.

సింహరాశి : బుధ-శుక్ర, శని స్థానం సింహరాశిలో 2 రాజయోగాలు ఏర్పరుస్తోంది. ఈ యోగం వల్ల ఈ రాశి వారికి అకస్మాత్తుగా చాలా డబ్బు వస్తుంది. ఇతరుల భాగస్వామ్యంతో వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి మంచి లాభాలు వస్తాయి. విదేశాలకు వెళ్లాలనే కోరిక నెరవేరుతుంది. ఈ సమయంలో పెట్టిన పెట్టుబడి పెద్ద లాభాలను ఇస్తుంది. ఆస్తి వివాదాల్లో మీదే పైచేయి అవుతుంది.

వృశ్చికం : గ్రహాల స్థానం వృశ్చిక రాశి వ్యక్తుల వృత్తి, ఆర్థిక స్థితిగతులలో పెద్ద మార్పును తెస్తుంది. వారు కొత్త ఉద్యోగం, ఇంక్రిమెంట్ పొందవచ్చు. చాలా కాలంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వారు పెద్ద లాభాలను పొందుతారు. ఇది చాలా ఉపశమనం కలిగిస్తుంది. కొత్త ఇల్లు లేదా కారు కొనుగోలు చేస్తారు.

కుంభం : కుంభరాశిలో ఏర్పడుతున్న 2 రాజయోగాలు ఈ రాశి వారి జీవితాన్ని సుఖవంతం చేస్తాయి. లగ్జరీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తారు. ఇల్లు లేదా కారు కొనుగోలు చేస్తారు. ఇంట్లో కొన్ని శుభ కార్యాలు ఉండవచ్చు. కొత్త మార్గాల్లో ఆదాయం ఉంటుంది. పనిలో అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది.

 

Also Read: TS SSC Results 2022: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల... బాలికలదే హవా..  

Also Read: Hyd Drugs Issue: హైదరాబాద్‌లో వెలుగులోకి సరికొత్త మత్తు దందా..కోడ్‌ ద్వారా విక్రయాలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News